Comedian Sudhakar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా సుమారు వందల చిత్రాలలో నటించి అద్భుతమైన కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సుధాకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల మొహాలలో చిరునవ్వు కనిపించేది.ఇలా వెండితెరపై ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన సుధాకర్ దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి దూరమయ్యారు అందుకు గల కారణం ఆయన అనారోగ్యంతో బాధ పడటమే.
ఇకపోతే రజనీకాంత్ తెలుగులో కమెడియన్ కన్నా పరిచయమయ్యే ముందు ఆయన తమిళంలో సూపర్ స్టార్ హీరో అని చాలా మందికి తెలియక పోవచ్చు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక రజనీకాంత్ ఒక మెగాస్టార్ వంటి హీరోల మాదిరిగా ఉండాల్సిన సుధాకర్ ప్రస్తుతం ఏ విధమైనటువంటి అవకాశాలు లేకుండా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. తమిళంలో ఈయన ఎంతో గొప్ప పేరున్న నటుడు. కానీ ఇండస్ట్రీలో ఈయన ఎదుగుదలను చూసి అక్కడ తమిళ దర్శక నిర్మాతలు ఓర్చుకోలేక పోయారు.
తెలుగు గడ్డ నుంచి తమిళంలోకి వచ్చి ఇలాంటి గుర్తింపు సంపాదించుకోవడం ఏంటి అంటూ కక్షపూరితంగా ఇతనిపై పగబట్టి ఇతనికి ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేసి ఈయనను తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లగొట్టారు. ఇలా తమిళ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి వచ్చిన ఈయన కమెడియన్ గా స్థిరపడి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఆరోగ్య సమస్యల వల్ల ఎలాంటి అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు.