నార్త్,సౌత్ చర్చల పై స్పందిస్తూ సంచలన వాఖ్యలు చేసిన అక్షయ్ కుమార్..?

ఇటీవలే నార్త్ సినిమా ఇండస్ట్రీ వర్సెస్ సౌత్ సినిమా ఇండస్ట్రీ అంశం తీవ్ర చర్చకు దారితీసిన విషయం అందరికీ తెలిసిందే. కన్నడ హీరో నటుడు కిచ్చా సుదీప్, బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ల మధ్య మొదలైన ఈ వ్యవహారం పెద్ద వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సినీ తారలు కూడా స్పందించారు. అంతే కాకుండా ఇద్దరు పోటాపోటీగా కామెంట్స్ కూడా చేశారు. అయితే ఇదే విషయంపై తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అయిన అక్షయ్ కుమార్ స్పందించారు.

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా నటించిన చిత్రం పృథ్వి రాజ్. ఈ సినిమా జూన్ 3న విడుదల కాబోతున్న ఈ విషయం అందరికి తెలిసిందే. విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా ఉన్నారు. అక్షయ్ కుమార్ కు ప్రమోషన్స్ లో భాగంగానే సౌత్ వర్సెస్ నార్త్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రశ్న ఎదురయింది. ఆ ప్రశ్న పై స్పందించిన అక్షయ్ కుమార్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

నార్త్, సౌత్ సినిమా అనే విభజన నాకు నచ్చదు. అసలు నేను పాన్ ఇండియా అనే పదాన్ని నమ్మను. ఎందుకంటే మనమందరం ఒకే ఇండస్ట్రీకి చెందిన వాళ్లం.. ఇలాంటి ప్రశ్నలు అడక్కుండా ఉంటారని ఆశిస్తున్నాను అంటూ కాస్త ఘాటుగా సమాధానమిచ్చారు అక్షయ్ కుమార్. బ్రిటిషర్లు మనల్ని విభజించి పరిపాలించారు.. ఈ విషయాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి.. వాటి నుంచే మనం పాఠాలు నేర్చుకోవాలి.. మనమందరం ఒకటే అనుకున్నప్పుడే ఆరోజు మరింత అద్భుతంగా పని చేయగలం అని చెప్పుకొచ్చారు అక్షయ్ కుమార్.