Actress: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న నటి ఆలియా భట్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన RRR సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి రామ్ చరణ్ కు జోడిగా సీత పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ఈ సినిమా తర్వాత ఆలియా నటించిన సినిమాలన్నీ తెలుగులో కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ప్రముఖ డైరెక్టర్ మహేష్ భట్ వారసురాలుగా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈమె నటనకు గాను జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.. ఇలా కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలోనే బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకుని ఏడాదిలోపే ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ చిన్నారికి రాహా అని నామకరణం చేశారు.
ప్రస్తుతం ఈ చిన్నారికి రెండు సంవత్సరాలు పూర్తి కావడంతో అలియా రణబీర్ మరో బిడ్డను ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఇటీవల ఒక పాడ్ కాస్ట్ లో పాల్గొన్న ఈమె ఈ విషయాన్ని వెల్లడించినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని నేరుగా కాకుండా ఇన్ డైరెక్ట్ గా ఆలియా ప్రస్తావించినట్టు సమాచారం. రాహ విషయంలో ప్రెగ్నెంట్ అనే తెలియగానే తన స్నేహితులకు బంధువులకు కొత్త పేర్లు పంపించాలని అందరిని కోరారట.
అప్పటికప్పుడు మంచి పేరు సెలెక్ట్ చేయడం అంటే కష్టతరం అవుతుందని ముందుగానే తన బిడ్డకు పేరును సెలెక్ట్ చేసినట్లు ఆలియా తెలిపారు. ఇలా పాప బాబు ఎవరు పుడతారో తెలియక ముందే రాహ పేరును ఎంపిక చేసుకున్నామని తెలిపారు. అయితే ఇప్పుడు కూడా తన స్నేహితులకు బంధువులకు మంచి పేర్లను పంపించమని ఆలియా దంపతులు కోరుతున్నారట అయితే ఎక్కువగా అబ్బాయికి సంబంధించిన పేర్లను ఈమె అడగడంతో అబ్బాయి కావాలని కోరుకుంటున్నారని తెలుస్తోంది. ఇలా మరోసారి అందరి నుంచి పేర్లను ఈమె సేకరించడంతో త్వరలోనే శుభవార్త చెప్పబోతున్నారు అంటూ అభిమానులు భావిస్తూ ముందుగానే ఈమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.