బిగ్ ట్విస్ట్: వ్యాక్సిన్ కొరతని ఇలా అధిగమించబోతున్నారు భారతదేశంలో.!

Vaccination for 140 Cr, but when?

Big Twist: Perfect Soluction for Vaccine Problem

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ.. ఓ పద్ధతీ పాడూ లేకుండా జరుగుతోందన్న విమర్శలున్నాయి. రెండో వేవ్ దూసుకొచ్చి, చాలామంది మరణాలకు కారణమవుతున్నా, వ్యాక్సినేషన్ ఎందుకు అనుకున్న విధంగా సాగడంలేదు.? అంటే, సమాధానంగా వ్యాక్సిన్ కొరతను ప్రస్తావిస్తున్నారు చాలామంది. నిజమే, దేశంలో వ్యాక్సిన్ కొరత వుంది. మొదటి డోస్ వేసుకున్నవారికి రెండో డోస్ దొరకడంలేదు. దాంతో, మొదటి డోస్ వ్యాక్సినేషన్ ఆపేయాల్సి వచ్చింది చాలా రాష్ట్రాల్లో.

ఇంకోపక్క 18 నుంచి 45 ఏళ్ళ లోపువారికి వ్యాక్సినేషన్ ఇవ్వాల్సి వుండగా, ఆ విషయమై చాలా రాష్ట్రాలు చేతులెత్తేశాయి. సమీప భవిష్యత్తులో వ్యాక్సిన్ కొరత తీరుతుందా.? లేదా.? అన్నదానిపై స్పష్టత లేదు. ఇంకోపక్క, వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు సరికొత్త ప్లాన్ సిద్ధమయినట్లే కనిపిస్తోంది. మామూలుగా అయితే కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధి 28 రోజులు. దీన్ని 4 నుంచి 6 వారాలకు పెంచారు. అంటే 28 నుంచి 42 రోజుల మధ్య వ్యాక్సిన్ రెండు డోసుల ప్రక్రియ పూర్తయినా ఫర్వాలేదు. తాజాగా, ఈ గడువుని ఏకంగా 12 నుంచి 16 వారాలకు పెంచబోతున్నారట. అంటే, 3 నెలల నుంచి 4 నెలల వ్యవధిలో రెండు డోసులు వేయబోతున్నారన్నమాట.

అంటే, వ్యాక్సిన్ కోసం ఎగబడేవారి సంఖ్య తగ్గుతుంది. ఎక్కువ సమయం వేచి చూస్తే, వ్యాక్సిన్ మెరుగైన ఫలితాలు ఇస్తుందన్నది తాజా లాజిక్. పైగా, ఇది విదేశాల్లో నిరూపితమైందట కూడా. కేవలం ఈ ఈక్వేషన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కి మాత్రమే వర్తించనుంది. కోవాగ్జిన్ విషయమై ఇదివరకటిలానే 28 రోజుల వ్యవధిలోనే రెండు డోసులు ఇవ్వాల్సి వుంటుందట. చెప్పేవాడికి వినేవాడు లోకువనుకోవాలా.? లేదంటే, శాస్త్రం.. అదేనండీ వైద్య శాస్త్రం అలాగే చెబుతోందని అనుకోవాలా.? ఏదైతేనేం, వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేసి, దేశ ప్రజలకు కరోనా బాధ తప్పితే అదే చాలు. వ్యవధి దొరుకుతుంది గనుక, ఎక్కువమందికి మొదటి డోస్ వ్యాక్సిన్ వేగంగా వేయడానికి వీలవుతుందని ప్రభుత్వాలు చెప్పే మాటల్లో నిజమెంతో చూడాలి.