Sukumar: అభిమానులకు బిగ్ షాక్… సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న సుకుమార్… రాజకీయాలలోకి ఏంట్రీ!

Sukumar: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ట్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వారిలో డైరెక్టర్ సుకుమార్ ఒకరు. ఈయన ఆర్య సినిమాతో తన సినీ ప్రయాణం మొదలుపెట్టి ఇటీవల పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేయబోతున్న విషయం తెలిసిందే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

ఇలా ఉండగా తాజాగా సుకుమార్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సుకుమార్ వ్యవహారం చూస్తుంటే ఈయన సినిమాలకు దూరం కాబోతున్నారని త్వరలోనే రాజకీయాలలోకి రాబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. అసలు సుకుమార్ సినిమాలకు దూరం కావడం ఏంటి అనే విషయానికి వస్తే..

ఇటీవల సుకుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు దీంతో ఈ వార్తలు సంచలనంగా మారాయి. వైసీపీ పార్టీ ఏర్పాటు చేసిన అవార్డుల వేడుకకు సుకుమార్ హాజరు కావడంతో ఈయన వైసీపీ పార్టీకి మద్దతు తెలుపుతున్నారా అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేస్తూ ప్రచారానికి వెళ్లడంతో మెగా ఫ్యామిలీ పూర్తిగా తనని దూరం పెడుతూ వచ్చారు ఇప్పుడు మరి సుకుమార్ కూడా వైసిపికి సపోర్ట్ చేయబోతున్నారని తెలిసి అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.

ఇలా వైసిపికి సపోర్ట్ చేస్తున్న ఈయన రాబోయే రోజుల్లో ఈ పార్టీలో చేరే అవకాశాలు కూడా ఉన్నాయని భావిస్తున్నారు. మరి ఈయన రాజకీయాలలోకి రాబోతున్నారు అంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి. ఇక చరణ్ సినిమా ప్రస్తుతం పనులలో సుకుమార్ బిజీగా ఉన్నారని తెలుస్తోంది.