కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఏపీ బడ్జెట్ సమావేశాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో తాత్కలికంగా ఓటాన్ బడ్జెట్ ని ప్రవేశ పెట్టారు. మూడు నెలల అవసరాల కోసం దీన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి ఈ బడ్జెట్ అందుబాటులో ఉంటుంది. కాగా జూన్ నెలతో ఓటాన్ బడ్జెట్ ముగుస్తుంది. దీంతో జూన్ లో పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జూన్ నెలాఖరుకల్లా ఈ సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందిట.
అయితే దీనిపై క్లారిటీ రావాలంటే ముందు లాక్ డౌన్ విషయంపై సరైన క్లారిటీ ఉండాలి. ఆ తర్వాత ఏపీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మే 17 తో మూడవ దశ లాక్ డౌన్ ముగుస్తుంది. ఇప్పటికే ప్రధాని మోదీ అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రుల సూచనలు, సలహాలు తీసుకున్నారు. నిన్న జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడటం జరిగింది. దీనిలో భాగంగా లాక్ డౌన్ కొనసాగిస్తారా? లేదా? అన్నది పక్కనబెట్టి కరోనా వ్యాక్సిన్ వచ్చేంత కాలం పోరాటం చేయక తప్పదని…మానవ జీవితంలో కరోనా భాగమవుతుందన్నట్లు వ్యాఖ్యానించారు.
20 లక్షల కోట్ల రూపాయిలు ఆర్ధిక ప్యాకేజ్ ని ప్రకటించి లాక్ డౌన్ 4.0 గా అభివర్ణించారు. దీన్ని బట్టి నాలుగో దశ లాక్ డౌన్ కొనసాగుతుంది కానీ…మరింతగా సడలింపులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దశల వారిగా లాక్ ఔడన్ ఎత్తేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సడలింపులు ఇవ్వడంతో జన జీవనం ఇబ్బందులు కాస్త తగ్గిన సంగతి తెలిసిందే. మద్యం షాపులు, ఉదయం ఏడు నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సరుకుల దుకాణలు తెరచి ఉండటానికి అనుమతులు లభించాయి.