Raw Papaya: సాధారణంగా అందరూ బాగా పండిన బొప్పాయి పండు తినటానికి ఇష్టపడతారు. పండిన బొప్పాయి పండు తినడం వల్ల రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కానీ పచ్చి బొప్పాయి పండు తినడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. పచ్చి బొప్పాయి పండులో మన ఆరోగ్యానికి అవసరమైన అనేక రకాల విటమిన్స్ ఉంటాయి. అంతేకాకుండా పచ్చి బొప్పాయి లో పొటాషియం, మెగ్నీషియం కూడా అధికంగా ఉంటాయి.పచ్చి బొప్పాయి పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజు పచ్చి బొప్పాయి పండు తినటం లేదా ప్రతిరోజు ఉదయం గ్రీన్ టీ లో పచ్చి బొప్పాయి ఉడికించి తాగటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అంతే కాకుండా బీపీ సమస్యతో బాధపడేవారు పచ్చి బొప్పాయి పండు తినటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పచ్చి బొప్పాయిలో ఉండే
పొపైన్, చైమో పొపైన్ అనే పదార్థాలు స్థూలకాయం సమస్యను నిర్మూలిస్తాయి.
బాగా పండిన బొప్పాయి పండులో కంటే పచ్చి బొప్పాయి పండులో యాక్టివ్ ఎంజైమ్స్ అధికంగా ఉంటాయి. ఇది శరీరఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఉదయం పచ్చి బొప్పాయి పండ్లు తినటం వల్ల జీర్ణక్రియ మెరుగు పడి అజీర్తి, మలబద్దకం, గ్యాస్టిక్ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. గర్భంతో ఉన్న వారు బొప్పాయి పండుకి దూరంగా ఉండాలి.