మళ్లీ మీడియా కి దొరికిపోయిన త్రిష,విజయ్ జంట.. సంగీత కి అన్యాయం జరగబోతుందా!

తమిళ సూపర్ స్టార్ విజయ్ కొత్తగా రాజకీయ పార్టీ స్థాపించిన సంగతి అందరికీ తెలిసిందే. భారీ జన సందోహం మధ్య విజయ్ తన తొలి రాజకీయ ప్రసంగాన్ని ఇచ్చారు. ఆ సభలో ఏడు లక్షల మంది పాల్గొన్నట్లు సమాచారం మొదటి స్పీచ్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన విజయ్ వ్యక్తిగత జీవితం గురించి ఇప్పుడు ఒక వార్త హల్ చల్ చేస్తుంది. నిజానికి విజయ్ ఏ ఫంక్షన్ కి వెళ్లిన భార్య సంగీత తో కలిసి వెళ్లడం అలవాటు అయితే ఈమధ్య ఎక్కడికి వెళ్ళినా విజయ్ ఒక్కడే వెళ్తున్నాడు.

పక్కన సంగీత కనిపించడం లేదు. ఇదే విషయం గా తమిళనాడులో వాడి వేడి చర్చ్ జరుగుతుంది. అయితే అదే సమయంలో సింగర్ సుచిత్ర విజయ్ తన భార్యకి ఎప్పుడో విడాకులు ఇచ్చేసాడని హీరోయిన్ త్రిష నీ పెళ్లి చేసుకోబోతున్నాడని చెప్పి బాంబు పేల్చింది. ఆ మాటలని నిజం చేసేలా కనిపిస్తున్నారు విజయ్, త్రిష.

ఎందుకంటే మొన్న హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి సందర్భంగా త్రిష, విజయ్ కలిసి ప్రత్యేక విమానంలో గోవాకి వెళ్లారు ఆ సమయంలో మీడియా కంటపడ్డారు వీరిద్దరూ. దాంతో కొంతమంది త్రిష కోసం విజయ్ తన భార్య సంగీత కి అన్యాయం చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా జస్టిస్ ఫర్ సంగీత అనే హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. విజయ్ పాతికేళ్ళ వైవాహిక జీవితంలో ప్రతి విషయంలోనూ భర్తకే తోడుగా నిలబడింది సంగీత.

అటువంటి వ్యక్తికి అన్యాయం చేసి త్రిషతో తిరగటం పద్ధతి కాదంటూ విజయ్ ప్రవర్తనని తప్పుపడుతున్నారు. అలాగే సమాజంలో ఒక గొప్ప హోదాలో ఉన్న వ్యక్తి అలాగే కాబోయే రాష్ట్ర నాయకుడు ఇలాంటివి చేయడం ఏ మాత్రం తగదు అంటూ విమర్శలు చేస్తున్నారు. విజయ్ భార్య సంగీత సోమలింగం అభిమానులు ఆమెకే సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున మద్దతుగా నిలుస్తున్నారు. మరి ఈ విషయంపై వారిద్దరూ ఎలా స్పందిస్తారో చూడాలి.