అల్లరి నరేష్ హీరోగా సుబ్బు మంగాదేవి డైరెక్షన్లో వస్తున్న సినిమా బచ్చలమల్లి. ఈ సినిమాని రాజేష్ దండ, బాలాజీ గుత్తా సంయుక్తంగా నిర్మించారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈనెల 20న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాదులో చిత్ర ట్రైలర్ ని విడుదల చేశారు నాని.ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ టీజర్ చూసినప్పుడే ఈ సినిమా హిట్ అయిపోయింది ఫిక్స్ అయిపో అని నరేష్ కి ఫోన్ చేసి చెప్పాను.
టీజర్ ని చూశాక ఈ సినిమా కోసం ఏదైనా చేయాలని ఉంది అని నరేష్ కి చెప్పి నాకు గా నేను ఈ ఈవెంట్ కి వచ్చాను. ట్రైలర్ లోనే సుబ్బు కథ చెప్పాలనుకున్నాడు అంటే సినిమాలో ఇంకా నిజాయితీగా ప్రయత్నించాడని ఊహించగలను.ఇప్పుడు ఈ ట్రైలర్ చూశాక ఇది బ్లాక్ బస్టర్ అవుతుందా ఇంకా ఏ స్థాయికి వెళ్తుందా అనే ఆసక్తి రెట్టింపు అయింది. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకం ప్రేక్షకుల్లో కూడా వచ్చేసింది అని చెప్పాడు నాని.
ఇక దర్శకుడు గురించి మాట్లాడుతూ సుబ్బు నాకు చాలా ఇష్టం, నా మజ్ను చిత్ర విజయంలో సగం క్రెడిట్ తనకే చెందుతుంది ఆయన ఈ చిత్రంతో భారీ హిట్ అందుకుంటాడు అన్న నమ్మకం కలుగుతుంది. ఇప్పటికే పుష్ప 2 సినిమా ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టింది ఇక బచ్చల మల్లి తో విజయవంతంగా డిసెంబర్ నెలని ముగించనున్నారని నమ్ముతున్నాను అంటూ మూవీ టీం కి ఆల్ ద బెస్ట్ చెప్పాడు నాని.
ఇక కథవిషయానికి వస్తే 1990 నేపథ్యంలో సాగే ఈ కథలో నరేష్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రని చేశారు అయితే హీరోయిన్ అమృత అయ్యర్ కథలోకి ప్రవేశించడంతో నరేష్ పాత్రలో చాలా మార్పులు వచ్చినట్లు ట్రైలర్ లో చూపించారు. చాన్నాళ్ల తర్వాత మంచి బలమైన పాత్ర నరేష్ కి పడినట్లు ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది.ఈ సినిమా అయినా నరేష్ కెరీర్ ఊపందుకోవాలని ఆశిస్తున్నారు అతని ఫ్యాన్స్.