నీకు ఎప్పుడూ తోడుంటాను.. సోషల్ మీడియా లో తల్లికి బర్త్డే విషెస్ చెప్పిన మంచు మనోజ్!

గత కొద్ది రోజులుగా మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి అందరికీ తెలిసిందే. ఇంటి సమస్య కాస్త రచ్చ కెక్కి పోలీస్ కేసుల వరకు వెళ్ళింది. మనోజ్ ది తప్పు అని విష్ణు, మోహన్ బాబు అంటే కాదు వాళ్ళదే తప్పు అంటూ తన వైపు వెర్షన్ వినిపిస్తున్నాడు మనోజ్. వీరి మధ్య జరిగిన గొడవలలో మోహన్ బాబు పాత్రికేయులపై దాడి చేయడం వలన టీవీ9 ప్రతినిధి హాస్పిటల్ పాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయంగా మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు అయింది.

గత కొద్దిరోజుల నుంచి ఈ వార్తలే సోషల్ మీడియా అంతా చక్కెర్లు కొడుతున్నాయి. మధ్యలో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్టు చేయడంతో మీడియా దృష్టి మొత్తం అటువైపు తిరిగింది. రెండు మూడు రోజుల నుంచి ఆ వార్తలు తోనే సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోతుంది. ఇదే విషయంగా అల్లు అర్జున్ కి టాలీవుడ్ మొత్తం అండగా నిలబడింది కొందరు స్వయంగా వెళ్లి పరామర్శిస్తే మరికొందరు సోషల్ మీడియా ద్వారా తమ సానుభూతిని తెలియజేశారు.

మంచు మనోజ్ కూడా అల్లు అర్జున్ కి సోషల్ మీడియా ద్వారా తన సానుభూతి తెలియజేశాడు. అలాగే ఈరోజు తన తల్లి నిర్మల పుట్టినరోజు కావటంతో సోషల్ మీడియా ద్వారా తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. దాంతోపాటు మన కుటుంబానికి నువ్వు హృదయం లాంటి దానివి, నీ ప్రేమ, కరుణ వల్లే అంతా కలిసి ఉండగలుగుతున్నాం అంటూ తల్లితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

హ్యాపీ బర్త్డే అమ్మ నీ ఆత్మ ధైర్యం నన్ను ఎప్పుడూ ఇన్స్పైర్ చేస్తుంది. నీకు ఎల్లప్పుడూ మంచి జరగాలని నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఏం జరిగినా సరే నువ్వు నాకు అండగా నిలబడ్డావు అదేవిధంగా నేను నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను నిన్ను చెప్పలేనంతగా ప్రేమిస్తున్నాను తల్లి అని రాసుకొచ్చాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.