చలికాలంలో మార్నింగ్ వాక్ విషయంలో జాగ్రత్తలివే..ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

కాలంతో సంబంధం లేకుండా మార్నింగ్ వాక్ చేయడం ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు అనే సంగతి తెలిసిందే. అయితే చలికాలంలో మార్నింగ్ వాక్ చేసేవాళ్లు కొన్ని విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఉదయాన్నే నిద్రలేచి వాకింగ్ చేయడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం పూట ఏ సమయంలో వాకింగ్ చేసినా విటమిన్ డితో పాతు హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి.

ఉదయం సమయంలో వాకింగ్ చేయడం వల్ల బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, హృదయ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అయితే చలికాలంలో అతిగా నడవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఉదయం సమయంలో అతిగా నడవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. మరి కొందరికి వాతావరణంలో మార్పుల వల్ల శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

చలికాలంలో వాకింగ్ కు వెళ్లే సమయాలను జాగ్రత్తగా సెట్ చేసుకుని స్వెట్లర్లు, మఫ్లర్లను ధరించి బయటకు వెళ్లాలి. వేగంగా నడకను మొదలుపెట్టి ఆ తర్వాత వేగాన్ని తగ్గిస్తూ నడవడం ద్వారా శ్వాస వేగాన్ని కంట్రోల్ చేయడం సాధ్యమవుతుంది. గుండె సమస్యలు, ఆస్తమా లేదా న్యుమోనియా వంటి సమస్యలు ఉన్నవాళ్లు సాయంత్రం సమయంలో నడకను అలవాటు చేసుకుంటే మంచిది.

కాస్త సూర్యరశ్మి ఉన్న సమయంలోనే బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే ఆరోగ్యానికి మంచిది. ప్రమాదకర స్థాయిలో చలి ఉన్నరోజున వాకింగ్ కు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజూ 10,000 అడుగులు నడవాలని నిపుణులు వెల్లడిస్తున్నారు. వారానికి కనీసం ఐదు రోజులు అరగంట పాటు నడవడం ద్వారా ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.