దిష్టి మొత్తం పోయింది బాబాయ్.. అల్లు అర్జున్ కి సపోర్టుగా మంచు మనోజ్ ట్వీట్!

సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటనలో అల్లు అర్జున్ అరెస్టు అయిన విషయం, తర్వాత విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ని టాలీవుడ్ మొత్తం పరామర్శించింది. మేమున్నామంటూ ధైర్యం చెప్పింది. కొందరు నేరుగా స్పందిస్తే కొందరు సోషల్ మీడియాలో స్పందించారు. అలాగే మంచు మనోజ్ కూడా అల్లు అర్జున్ కి సపోర్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దిష్టి మొత్తం పోయింది బాబాయ్..

వెల్కమ్ బ్యాక్ టు అల్లు అర్జున్ గారూ.. క్లిష్ట సమయంలో మీరు కనబరిచిన వ్యవహార శైలిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను, థియేటర్ ఘటన దరిద్రుష్టకరం, బాధిత కుటుంబానికి మీరు ఇచ్చిన హామీ మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. భద్రతకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి పక్కవారి పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తోంది. మీ కుటుంబానికి శాంతి సంతోషాలు కలగాలని కోరుకుంటున్నాను అంటూ తన ఎక్స్ లో పోస్ట్ చేశాడు.

ఇక అల్లు అర్జున్ విడుదలై నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ తన న్యాయవాద బృందంతో మాట్లాడిన తరువాత జూబ్లీహిల్స్ లో ఉన్న తన ఇంటికి వచ్చాడు. అప్పటికే బన్నీ కోసం ఎదురుచూస్తున్న తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బన్నీ రావడంతో ఒక్కసారి గా ఎమోషనల్ అయ్యారు. తర్వాత మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్ ని టాలీవుడ్ మొత్తం పరామర్శించింది.

టాలీవుడ్ మాత్రమే కాకుండా బాలీవుడ్, శాండిల్ వుడ్ నుంచి కూడా అతనికి పూర్తి మద్దతు లభించింది. బన్నీ ఇంటికి రాఘవేంద్రరావు, సుకుమార్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, బోయపాటి శ్రీను, దిల్ రాజు, వెంకటేష్, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, రానా, శర్వానంద్, కధా రచయిత చిన్ని కృష్ణ, అఖిల్ సుధీర్ బాబు, అడవి శేష్, ఉపేంద్ర, సుధీర్, రాజశేఖర్, జీవిత, తమన్ తదితరులు విచ్చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రముఖ నటుడు ప్రభాస్ అల్లు అర్జున్తో ఫోన్లో మాట్లాడారు.