భార్యతో కలిసి డాన్స్ చేసిన రాజమౌళి.. దెబ్బకి సోషల్ మీడియా షేక్!

దర్శక ధీరుడు రాజమౌళి భార్య రమ తో కలిసి అదిరిపోయే రేంజ్ లో డాన్స్ చేశారు. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు చేశారో ఒకసారి చూద్దాం. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు హీరో శ్రీ సింహ వైవాహిక బంధం లోకి అడుగుపెడుతున్నాడు. సీనియర్ నటుడు రాజకీయ నాయకుడు అయిన మురళీమోహన్ మనవరాలు రాగ మాగంటి మెడలో మూడు ముళ్ళు వేశాడు. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా సంగీత్ వేడుక గ్రాండ్గా నిర్వహించారు. ఈ క్రమంలోనే రాజమౌళి భార్యతో కలిసి అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి సినిమాలోని లంచ్ కి వస్తావా మంచి కొస్తావా పాటకి స్టెప్పులు వేశారు.

ఈ డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రాజమౌళి లో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ తెగ మురిసిపోతున్నారు ఆయన అభిమానులు. ఈ వయసులో కూడా కమర్షియల్ హీరో స్టెప్స్ కి ఏ మాత్రం తగ్గకుండా డాన్స్ చేస్తున్న రాజమౌళి ని అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నారంటూ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.

మహేష్ బాబుతో రాజమౌళి తీయబోయే సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటే మీరేమో ఈ విధంగా డాన్స్ చేస్తున్నారంటూ సరదాగా మీమ్స్ పెడుతున్నారు దర్శకధీరుడి అభిమానులు. అంతేకాకుండా నూతన జంటకి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు ఇక శ్రీ సింహ మత్తు వదలరా, మత్తు వదలరా టు వంటి చిత్రాలలో హీరోగా చేసి మంచి విజయాలను అందుకున్నాడు.

హీరో కన్నా ముందే శ్రీ సింహ యమదొంగ సినిమాలో చైల్డ్ యాక్టర్ గా నటించాడు తరువాత దొంగలున్నారు జాగ్రత్త, చిత్రాలలో కూడా నటించాడు శ్రీ సింహ. ఇక రాజమౌళి విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమాని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు తెలుస్తోంది వచ్చే ఏడాది నుంచి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్తారని సమాచారం.