KTR: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే కేటీఆర్ జైలుకు వెళ్తారు అంటూ గత కొద్దిరోజులుగా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు పాట పాడుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తన అరెస్ట్ గురించి నిత్యం కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ…ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మానసికస్థితి దిగజారుతోందని కేటీఆర్ మండిపడ్డారు. బ్యాగ్ నిండా నోట్ల కట్లతో పట్టుబడి జైలు జీవితం అనుభవించిన తర్వాత, అందరూ అదే అనుభవించాలనే ఉద్దేశం రేవంత్ రెడ్డికి ఉందని అనిపిస్తోంది. తమ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పైన, తమ కంపెనీ కార్యకలాపాలపైన ఆ పథకం ప్రభావాన్ని వ్యక్తపరిచినందుకు L&T వంటి ప్రముఖ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ని జైలుకు పంపిస్తాను అంటూ ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడరు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన వారిపట్ల రేవంత్ రెడ్డి జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారంటూ ఈయన ఆగ్రహం వ్యక్తం చేశారు.రేవంత్ రెడ్డి ఈ విషయంలో చేసిన వ్యాఖ్యలు దిగజారుతున్న ఆయన మానసిక స్థితికి అద్దం పడుతున్నాయి. ఇలాంటి నిర్లక్ష్యమైన వ్యాఖ్యలతో రేవంత్ పరిశ్రమలకు ఏ సందేశం పంపుతున్నారు. ఇదేనా రాహుల్ గాంధీ దేశంలో పెట్టుబడులను ఆకర్షించడానికి తమ పార్టీ ముఖ్యమంత్రులకు నేర్పించిన గొప్ప వ్యూహం అంటూ రేవంత్ వ్యవహార శైలి పై ఈయన మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక కేసులో కేటీఆర్ ను ఇరికించి తనని జైలుకు పంపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో సందర్భాలలో కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు మీడియా సమావేశాలలో మాట్లాడుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తన అరెస్టు గురించి రేవంత్ రెడ్డి బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఈయన మండిపడ్డారు.