మనలో చాలామంది చర్మ సంరక్షణ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే చర్మ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. పిస్తా, ఆక్రోట్, పల్లీలు, నువ్వులు, అవిసె గింజలు, బాదం తీసుకోవడం ద్వారా చర్మ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. చర్మం ముడతలు పడకుండా చేసి ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో విటమిన్ సి సహాయపడుతుంది.
నిమ్మ, కమలా, నారింజ, ఆపిల్, జామ పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మాయిశ్చరైజర్, ఆలివ్‌నూనె, కొబ్బరినూనె వంటివి వాడడం ద్వారా చర్మ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు. తగినన్ని నీరు తీసుకోవడం, వాసిలిన్ లేదా నెయ్యి రాసుకోవడం ద్వారా చర్మం పగలకుండా చేయవచ్చు. చలికాలంలో వేడి ఆహారం తీసుకోవడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు.
అల్లం, వెల్లుల్లి, దాల్చినచెక్క, లవంగాలు వంటి మసాలా దినుసులు వాడడం వల్ల కూడా శీతాకాలం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు. రోజులో కనీసం అరగంట అయినా ఎండ తగిలేలా చూసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. చలికాలంలో ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ చేయకూడదు. చలికాలంలో ఈ క్రేజీ చిట్కాలను తప్పనిసరిగా పాటించాలి.
చర్మ సంబంధిత సమస్యలకు సరైన చిట్కాలను పాటించడం ద్వారా దీర్ఘకాలంలో సమస్యలు దూరమవుతాయి. ఇప్పటికే చర్మ సమస్యలతో బాధ పడేవాళ్లు దీర్ఘకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా అధిగమిస్తే మంచిది. చలికాలంలో చర్మ సమస్యల విషయంలో తప్పులు చేస్తే కొత్త ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ అయితే ఉంది.