AP: 2024 అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఎంతో మంది సినీ సెలెబ్రిటీలకు కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలియజేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది సినీ సెలెబ్రిటీల ప్రచార కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి కూడా ఒకరు. కృష్ణంరాజు గతంలో బిజెపి హయామంలో మంత్రిగా కూడా పని చేశారు ఇలా రాజకీయాలతో ఎంతో మంచి అనుభవం ఉన్న కుటుంబం కావడంతో శ్యామలాదేవి కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం గెలుపును ఆకాంక్షించడమే కాకుండా పిఠాపురం వెళ్లి మరి పవన్ కళ్యాణ్ గెలుపుకు ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
ఇకపోతే తాజాగా సీనియర్ ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. నందమూరి తారక రామారావు తొలి సినిమా మన దేశం విడుదలై 75 ఏళ్లు అవుతోంది. ఈ తరుణంలో విజయవాడలోని పోరంకిలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలను నిర్వహించారు. టిడిపి నేత టి డి జనార్ధన్ చైర్మన్ గా ఉన్న ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్సైట్ కమిటీ ఈ వేడుకలను నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, శ్యామల దేవి కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె చంద్రబాబు నాయుడు గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఏకంగా ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమాలోని డైలాగ్ చెప్పడంతో ఒక్కసారిగా సభ మొత్తం దద్దరిల్లిపోయింది. మాహిష్మతి ఊపిరి పీల్చుకో.. బాహుబలి వచ్చేసాడు.. అదే మా చంద్రబాబు అనే డైలాగ్ చెప్పడంతో సభ చప్పట్లతో మార్మోగిపోయింది. ప్రస్తుతం ఆమె చేసిన ప్రసంగం వీడియో వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ తన అఫీషియల్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు దీంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతుంది.
బాహుబలి సినిమా డైలాగ్ చెప్పి, చంద్రబాబు గారి పరిపాలనను ప్రశంసించిన, దివంగత కృష్ణంరాజు గారి సతీమణి, శ్యామలాదేవి గారు #NTRCineVajrotsavam#ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/jm6tDOQNd5
— Telugu Desam Party (@JaiTDP) December 14, 2024