సినిమా ఇండస్ట్రీలో చిరంజీవికి ఉన్న స్థానం ప్రత్యేకమైనది. ఇండస్ట్రీలో ఆయనకి అంత గౌరవం ఉండటానికి కారణం సినిమాల్లో హిట్స్ కొట్టడం మాత్రమే కాదు వ్యక్తిగతంగా కూడా సమాజానికి ఎంతో సేవ చేశారు. అంతేకాదు ఆయన ఇన్స్పిరేషన్ గా చాలామంది సినిమా రంగం వైపు అడుగులు వేశారు. వాళ్లందరూ చిరంజీవి వలన ఏదో ఒక ఉపయోగం పొందిన వారే. ఇక మెగా కుటుంబం నుంచి కూడా ఆయన ఇన్స్పిరేషన్ తో చాలామంది హీరోలు అయ్యారు.
ఇటు అల్లు కుటుంబం నుంచి కూడా చిరంజీవి సినిమా ఇన్స్పిరేషన్తోనే అర్జున్ హీరో అయ్యాడు. ఆ విషయం అతనే చాలాసార్లు సభాముఖంగా చెప్పాడు. అయితే చాలా రోజుల నుంచి అల్లు కుటుంబానికి మెగా కుటుంబానికి మధ్య దూరం పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు తగినట్లుగానే ఎప్పుడు చిరంజీవి తర్వాతే ఎవరైనా అని చెప్పే అల్లు అర్జున్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ గురించి మాట్లాడటం మానేసి తనకంటూ సొంత ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు.
తన స్పీచెస్ లో కూడా ఎక్కడా మెగా ఫ్యామిలీ గురించి గానీ చిరంజీవి గురించి గానీ మాట్లాడకుండా నా ఆర్మీ నా ఫ్యాన్స్ అంటూ మాట్లాడటం మొదలు పెట్టాడు. అలాగే మన పుష్పటు సినిమాలో డైలాగులు కూడా చిరంజీవిని ఉద్దేశించి పెట్టినవే అందరికీ తెలిసిందే. అలాగే చాలా రోజుల నుంచి ఈ రెండు కుటుంబాలు కలిసిన సందర్భాలు లేకపోవటం వలన పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని తెలిసిందో అప్పుడే చిరంజీవి షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని మరీ భార్యని తీసుకొని అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళాడు.
అలాగే నడవలేని స్థితిలో కూడా నాగబాబు బన్నీ ఇంటికి వెళ్ళాడు. అంతేకాదు పుష్ప టు టికెట్లు రేట్లు విషయంలో పవన్ కళ్యాణ్ బన్నీకి ఎంత సాయం చేశాడు. ఇవన్నీ చూస్తుంటే కలిసి ఉన్న సందర్భాలు లేనంత మాత్రాన విడిపోయినట్లు కాదు ఒకవేళ అలాంటి గ్యాప్స్ ఏమైనా ఉన్నా నిన్న జరిగిన సంఘటనలను బట్టి చూస్తే ఆ రెండు ఫ్యామిలీలో కలిసిపోయినట్లే కనిపిస్తున్నాయి.