Anitha: స్మగ్లింగ్ చేస్తేనే హీరోలా చూస్తున్నారు.. హోమ్ మినిస్టర్ కామెంట్స్ అల్లు అర్జున్ గురించేనా?

Anitha: అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులు కూడా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు అయితే తాజాగా ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత సైతం మీడియా సమావేశంలో మాట్లాడుతూ చేస్తున్న వ్యాఖ్యలు పరోక్షంగా అల్లు అర్జున్ ను ఉద్దేశించి మాట్లాడారని స్పష్టమవుతుంది.

ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో యువత సినిమాలు చూసి పూర్తిగా చెడిపోతున్నారని ఈమె తెలిపారు. ఒకప్పుడు యువత సినిమాలు చూసి అందులో ఉన్న మంచిని మాత్రమే పరిగణలోకి తీసుకునే వారు కానీ ప్రస్తుతం మాత్రం మంచిని వదిలేసి చెడుని ఆదర్శంగా తీసుకుంటున్నారని ఈమె తెలిపారు.

ప్రస్తుతం ఉన్న ఈ సమాజంలో ఎవరైతే స్మగ్లింగ్ చేస్తుంటారు ఎవరైతే గంజాయి, డ్రగ్స్ తీసుకుంటున్నారు అలాంటి వారిని హీరోలుగా చూస్తున్నారని తెలిపారు. కానీ ఇలాంటి సంస్కృతి పోయి ఆడిబిడ్డలను రక్షించే సంస్కృతి రావాలని, అలాంటి వారిని హీరోలుగా చూడాలి అంటూ ఈ సందర్భంగా హోం మినిస్టర్ అనిత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు పరోక్షంగా అల్లు అర్జున్ ఉద్దేశించి చేశారని స్పష్టమవుతుంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అభిమానులు ఈమెపై పరోక్షంగా కామెంట్ చేస్తున్నారు సినిమాలను కేవలం సినిమాలు మాదిరిగానే చూడాలంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం పవన్ సినిమాల గురించి ప్రస్తావనకు తీసుకువస్తున్నారు. మొత్తానికి కూటమి నేతలు అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే.