రెండు దశాబ్దాల క్రితమే పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నటుడు ఉపేంద్ర. ఆయన కన్నడ డబ్బింగ్ సినిమాలతో మన ముందుకు రావటమే కాకుండా డైరెక్ట్ గా తెలుగు సినిమాలు తీసి టాలీవుడ్ కి దగ్గరయిన నటుడు. ఈయన సినిమాలు ఎప్పుడు అడ్వాన్స్డ్గా ఉంటాయి. సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తర్వాత చాలా రోజులకి మళ్లీ ఒక సినిమాతో మన ముందుకి వస్తున్నారు ఉపేంద్ర. యు ఐ పేరుతో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకి వస్తుంది.
ఈ సందర్భంగా ఉపేంద్ర మీడియాతో మాట్లాడారు. మన ఎడ్యుకేషన్ సిస్టం లో ఏ ఫర్ ఆపిల్,బి ఫర్ బాట్ అని నేర్పించారు, దానివలన థింకింగ్ కెపాసిటీ తగ్గిపోయింది అలా కాకుండా ఏ ఫర్ ఏమవుతుందో మీరే ఊహించండి అంటే చాలా పేర్లే వచ్చి ఉండేవి, మన ఆలోచన మరోలా ఉండేది. నా కథలో కూడా అలాంటి కొత్త ఆలోచనని చెప్పాలని ప్రయత్నం చేస్తుంటాను ఆ కాన్సెప్ట్ వచ్చినదే యు ఐ సినిమా.
నా వరకు థియేటర్లలో కూర్చొని సినిమా చూసిన ప్రేక్షకుడే అసలైన స్టార్, నా మొదటి సినిమాతోనే దానన్ని కన్ఫామ్ చేసుకున్నాను. ఆడియన్స్ ఒక ఫిలిం మేకర్ కంటే పైనే ఉంటారు, ఈ సినిమాతో ఆడియన్స్ ఇంటరాక్ట్ అవుతారు అని చెప్పుకొచ్చాడు ఉపేంద్ర. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ ఒక సర్రియల్ వరల్డ్ క్రియేట్ చేశారు, చాలా డిఫరెంట్ సెట్స్ సినిమా కోసం డిజైన్ చేశాము.
సెట్స్ ముందు చూడటానికి చాలా విచిత్రంగా ఉంటాయి కానీ డీకోడ్ చేసినప్పుడు దాని వెనుక ఉన్న మీనింగ్ అర్థం అవుతుందని చెప్పాడు ఉపేంద్ర. రజినీకాంత్ తో కూలీ సినిమా చేస్తున్నారు కదా ఎలా అనిపించింది అనే ప్రశ్నకి సమాధానం గా ఆయనతో వర్క్ చేయడం నా జీవిత కాలపు కల, ఆయనకి నేను ఏకలవ్య శిష్యుడిని ఆయనతో వర్క్ చేయటం మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకొచ్చాడు ఉపేంద్ర.