సింహాచలం అప్పన్నని దర్శనం చేసుకున్న కౌశల్ మండా.. ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే!

బిగ్ బాస్ అనేది ఎంతో మందికి మంచి పాపులారిటీని తీసుకువచ్చింది. ఈ షోలో పాల్గొనాలని, టాలెంట్ నిరూపించుకుని తమ కెరియర్ ని బిల్డ్ చేసుకోవాలని ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. వందరోజులకి పైగా సాగే ఈ రియాలిటీ షోలో గెలిచిన వ్యక్తికి మంచి పారితోషకం అందుతుంది. అయితే చాలామంది బిగ్ బాస్ షో తర్వాత తమ కెరియర్ బిల్డవడం కాదు ఉన్న కెరియర్ లాస్ అయిపోయాం అంటూ గగ్గోలు పెడుతున్నారు.

వారు చెప్పినట్లుగానే బిగ్ బాస్ లో గెలిచిన విన్నర్ లు ప్రస్తుతం ఎక్కడ యాక్టివ్గా కనిపించడం లేదు. ఇక బిగ్ బాస్ తెలుగు 2 సీజన్ విజేత కౌశల్ మండా గురించి ప్రత్యేకమైన అవసరం లేదు. ఆ సీజన్లో ఆయన విన్నర్ గా నిలవడం, ఆయన కోసం ఒక ఆర్మీ రెడీ అవ్వటం ఇవన్నీ అప్పట్లో ఒక సెన్సేషన్. అయితే షో గెలిచిన తర్వాత అతని కెరియర్ ఊపందుకోలేదు సరి కదా ఒకటి రెండు షో స్ తర్వాత తర్వాత పూర్తిగా కనుమరుగైపోయాడు.

బిగ్ బాస్ కి ముందు ఒకటి రెండు సినిమాల్లో కనిపించిన కౌశల్ బిగ్ బాస్ తర్వాత పెద్దగా సినిమాల్లో కూడా కనిపించలేదు. గత సంవత్సరం శంకర్ దర్శకత్వం వహించిన రైట్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో హీరోగా నటించిన కౌశల్. ఈ సినిమా మలయాళం సినిమా మెమోరీస్ సినిమాకి రీమేక్. నిర్మాతలు లుకలాపు మధు, మహంకాళి దివాకర్ లో సంయుక్తంగా రైట్ ను రీమేక్ సినిమాగా నిర్మించారు.

లీషా ఎక్లైర్స్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయింది కూడా జనాలకి తెలియకుండా పోయింది.ప్రస్తుతం తన సొంత యూట్యూబ్ ఛానల్ లో మాత్రమే కనిపిస్తున్న కౌశల్ మండా ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి సింహాచలం అప్పన్నని దర్శించుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశాడు. అంతేకానీ తన కెరీర్ కి సంబంధించిన విషయాలు కానీ తన అప్కమింగ్ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలు కానీ ఏవి అప్డేట్ ఇవ్వలేదు.