ప్రభాస్‌-కృతిసనన్‌ మధ్య ఏముంది?

ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న కబురు ఒకటి బాగా వైరల్ అవుతోంది. అదే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రేమలో ఉందన్న వార్త. అసలు ఈ వార్తకు బీజం ఎక్కడపడిందన్నది తేలాల్సిన విషయం. హీరో ప్రభాస్‌తో బాలీవుడ్‌ తార కృతి సనన్‌ ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తలు.. వాటిపై నెటిజన్లు పెడుతున్న పోస్టులతో సోషల్ మీడియా బాగా హీటెక్కిపోయింది!

అసలు విషయానికొస్తే.. ఇటీవల బాలీవుడ్ హీరో వరుణ్‌ ధావన్‌.. ప్రభాస్‌ – కృతిసనన్‌ స్నేహం గురించి చేసిన వ్యాఖ్యలు ఈ వదంతులకు మరింత ఊతమిచ్చాయి. హల్ చల్ సృష్టించాయి. ఊహించని ఈ పరిణామం ప్రభాస్ అభిమానుల్లోనూ కలకాలాన్నే సృస్టించిదనోచ్చు. ఇండస్ట్రీలోనూ చర్చకు తావిచ్చాయి. ఈ వార్తలు ఇంకా వ్యాప్తి కాకముందే వీరిపై స్పష్టత ఇచ్చింది నాయిక కృతి సనన్‌. తాజా ఇన్‌స్టా పోస్ట్‌ ద్వారా తమ మధ్య ఉన్నది ప్రేమ కాదని తేల్చి చెప్పింది. ఆమె మాటల్లోనే.. ”మా మధ్య ఉన్నది ప్రేమ కాదు. ఇది కావాలని చేసిన ప్రచారం కాదు. సరదా కోసం వరుణ్‌ ధావన్ మాట్లాడిన మాటలు అందరికీ తప్పుడు సంకేతాలు పంపాయి.

ఈ సరదా మాటల్ని లైట్ గా తీసుకోండి. ఓ డాన్స్‌ షోలో ఆయన చేసిన వ్యాఖ్యలు అనవసర ప్రచారాలకు దారి తీశాయి. ఏదో ఒక వెబ్‌ సైట్‌ మా పెండ్లి తేదీని ప్రకటించకముందే ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. మా ప్రేమ గురించి వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు” అని తెలపడంతో ఆయన అభిమానులేకాదు.. ఇండస్ట్రీ సైతం హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకుంది.