Tere Ishk Mein: వెర్సటైల్ స్టార్ ధనుష్, కృతిసనన్ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ‘తేరే ఇష్క్ మె’. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో భూషణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ దక్కుతోంది. నవంబర్ 28న విడుదలైన ఈ చిత్రం రోజు రోజుకీ ప్రేక్షకాదరణను పెంచుకుంటోంది. సినిమా విడుదలై రెండో వారాంతం పూర్తైనప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధిస్తోంది.

విడుదలైన 10 రోజులకుగానూ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.141.86 కోట్లు కలెక్షన్స్‌ను సాధించింది. ఇటు ఇండియాలోనే కాకుండా ఓవర్‌సీస్లోనూ సినిమా క్లీన్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. పాజిటివ్ మౌత్ టాక్‌తో వసూళ్ల పరంగా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. నటీనటులు చక్కటి పెర్ఫామెన్స్‌తో ఇంటెన్స్, ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

