Ram Charan : చరణ్ ‘ఆచార్య’ సినిమాకు పట్టుకున్న సెంటిమెంట్ గండం.. ఏమవుతుందో మరి..!

Ram Charan : ఆర్ఆర్ఆర్ సినిమా విజయం తో మంచి జోరు మీద వున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రం ఆచార్య. ఈ సినిమా కూడా విడుదల కు సిద్ధంగా వుంది.15 సంవత్సరాల సినీ కెరీర్ లో రామ్ చరణ్ ఇప్పటివరకు కేవలం 14 సినిమాలలో మాత్రమే నటించారు. శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 15 వ చిత్రంగా తెరకేక్కుతోంది.ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత్తగా వ్యవహారిస్తున్నారు. ఈ సినిమాలో కైరా అద్వానీ రామ్ చరణ్ కు జోడి గా నటిస్తోంది.

అయితే రామ్ చరణ్ 15 సంవత్సరాల సిని ప్రస్థానం లో ఒక సెంటిమెంట్ వెంటడుతోంది. ఇపుడు ఈ సెంటిమెంట్ రామ్ చరణ్ అభిమానులను కలవరపెడుతోంది.అదేంటంటే…చరణ్ ఒకే ఏడాది రెండు సినిమాలను విడుదల చేస్తే మొదట విడుదల చేసిన సినిమా హిట్టైనా తర్వాత విడుదల చేసిన సినిమా ఫ్లాపవుతుందట.2013 సంవత్సరంలో చరణ్ హీరోగా తెరకెక్కిన నాయక్, తుఫాన్ సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలలో నాయక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా తుఫాన్ మూవీ మాత్రం ఫ్లాప్ గా నిలిచింది. 2014 సంవత్సరంలో కొన్ని నెలల గ్యాప్ లో ఎవడు, గోవిందుడు అందరివాడేలే సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలలో ఎవడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే గోవిందుడు అందరివాడేలే సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.

ఆచార్యతో చరణ్ ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఆర్ ఆర్ ఆర్ ఘన విజయం తర్వాత వస్తున్న ఆచార్య ఫలితం ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరోవైపు రాజమౌళి డైరెక్షన్ లో నటించిన హీరో తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుందని ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఉంది. ఈ రెండు సెంటిమెంట్ లను రామ్ చరణ్ ఆచార్య సినిమాతో ఎలా గట్టేక్కుతాడో మరి వేచి చూడాలి.