సౌత్ లో ప్రస్తుతం పాన్ ఇండియా కల్చర్ నడుస్తుంది. స్టార్ హీరోల చిత్రాలు అన్ని కూడా యూనివర్శల్ స్టొరీ లైన్ తో పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకేక్కుతున్నాయి. ఇక ఈ సినిమాలు ప్రారంభం నుంచి భారీ హైప్ ని క్రియేట్ చేశాయి. అలాగే రెగ్యులర్ గా బజ్ క్రియేట్ చేస్తున్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలపై ఏ రేంజ్ లో బజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభాస్ బ్రాండ్ మూవీస్ పక్కన పెడితే ఆ తరువాత సౌత్ లో హ్యూజ్ బజ్ ఉన్న చిత్రాలు చూసుకుంటే తెలుగు, తమిళ్ భాషలలో కూడా ఉన్నాయి అని చెప్పాలి.
అలాగే ఇవన్ని కూడా కరెక్ట్ గా ఫెస్టివల్ టైమ్ లోనే రిలీజ్ కి రెడీ అవుతూ ఉండటం ఇంకా ప్రత్యేకత అని చెప్పాలి. వీటిలో ఆగష్టు నెలలో ఇండిపెండెంట్స్ డే సందర్భంగా సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమా రిలీజ్ అవుతుంది. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. దీని తర్వాత దసరా కానుకగా ఇళయదళపతి విజయ్ లియో మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ ఇప్పటికే 400 కోట్ల బిజినెస్ జరిగిందనే మాట వినిపిస్తుంది.

ఇక దీపావళి కానుకగా కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీతో పాటు, ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ రెండు పాన్ ఇండియా మూవీస్ కావడం పోటీ ఉంటుందా లేదంటే ధనుష్ వెనక్కి వెళ్తాడా అనేది చూడాలి. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రామ్ చరణ్, శంకర్ కాంబో మూవీ, అజిత్ కుమార్ 62వ మూవీ, అలాగే సూర్య, శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూర్య42వ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.
ఇక వేసవి వినోదంగా అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ సిద్ధం అవుతుంది. మరి ఈ సినిమాలలో నాన్ బాహుబలి రికార్డులకి ఏ మూవీ చేరువ అవుతుందనేది ఇప్పుడు సౌత్ లో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఇండియన్ వైజ్ గా వెయ్యి కోట్ల గ్రాస్ అందుకోవడం కొంత ఈజీ అయిన నేపధ్యంలో ఈ స్టార్ హీరోలు అందరూ కూడా దానిపై గురి పెడుతున్నారు. మరి వీరిలో ఎంత మంది ఆ ఫీట్ అందుకుంటారు అనేది చూడాలి.

