నవ దంపతులుగా మారిన విజయ్ రష్మిక.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోటో?

సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలెబ్రెటీలకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అయితే ఎక్కువగా సెలబ్రిటీలకు సంబంధించిన పుకార్లు భారీగా చక్కర్లు కొడుతుంటాయి. ఒక సినిమాలో ఒక హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయి సినిమా హిట్ అయితే వారిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు సృష్టిస్తారు. ఇలాంటి వార్తలతో తరచూ ట్రెండింగ్ లో ఉన్నటువంటి వారిలో విజయ్ దేవరకొండ రష్మిక జంట ఒకటి.

వీరిద్దరూ కలిసి నటించిన గీత గోవిందం సినిమాలో వీరికి కెమిస్ట్రీ అద్భుతంగా ఉండడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అదే విధంగా వీరిద్దరూ కలిసి పలు యాడ్స్ చేయడమే కాకుండా తరచూ పలు అకేషన్స్ లో కలిసి సందడి చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ వార్తలు సృష్టించారు. అయితే మా ఇద్దరి మధ్య ఏ విధమైనటువంటి సంబంధం లేదని ఎప్పటికప్పుడు ఈ జంట వాటిని కొట్టి పారేసిన వీరి గురించి వచ్చే వార్తలు మాత్రం ఆగడం లేదు.

ఇకపోతే తాజాగా విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరూ నవ దంపతులుగా ఉన్నటువంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇద్దరూ పెళ్లి దుస్తులలో మెరిసిపోతూ ఉండడమే కాకుండా పూలమాలలు ధరించి ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఈ ఫోటో ఒక్కసారిగా వైరల్ అవుతుంది. ఇప్పటికే వీరిద్దరి గురించి ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఫోటో మరింత అనుమానాలను బలం చేసింది.అయితే ఈ ఫోటో వెనుక ఉన్న కారణం ఏంటి అనే విషయానికి వస్తే ఓ నేటిజన్ తన క్రియేటివిటీనంత ఉపయోగించి ఇలా రష్మిక విజయ్ దేవరకొండ ఫోటోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.