ట్రైలర్ టాక్ : ఊహించని ఎలిమెంట్స్ తో పర్ఫెక్ట్ గా “రావణాసుర”.!

మాస్ మహారాజ రవితేజ ఇప్పుడు రెండు వరుస భారీ హిట్స్ తో ఒకదాన్ని మించి ఒకటి రికార్డ్స్ కొట్టగా ఇక నెక్స్ట్ మూడో హిట్ కోసం అన్నట్టుగా తీసిన సాలిడ్ చిత్రమే “రావణాసుర”. దర్శకుడు సుధీర్ వర్మ తో చేసిన ఈ సినిమా కోసం మంచి ఆసక్తి నెలకొంది.

ఇది వరకే టీజర్ తో ఈ సినిమా ఒక ఇంటెన్స్ థ్రిల్లర్ డ్రామా అనుకున్న వారిని ఈ ట్రైలర్ డెఫినెట్ గా ఆశ్చర్య పరుస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే ఈ ట్రైలర్ థిల్లర్ సస్పెన్స్ అంశాలతో పాటుగా రవితేజ నుంచి మిస్ అవుతుందా అనుకున్న కామెడీ యాంగిల్ కూడా బాలన్స్ చెయ్యడం విశేషం.

అంతే కాకుండా వాటిలో మళ్ళీ రొమాంటిక్ యాంగిల్ కూడా టచ్ చేసారు. హీరోయిన్స్ ఫరియా, మెగా ఆకాష్ అలాగే అను ఇమ్మానుయేల్ లతో ఇంట్రెస్టింగ్ సీన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ లాయర్ గా రవితేజ అదరగొట్టగా సాలిడ్ ఏక్షన్ మరియు విజువల్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి.

అలాగే హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం మరింత ఆసక్తిని సినిమాపై పెంచింది. ఇంకా నటుడు జైరాం, సుశాంత్ ల పాత్రలు కూడా కనిపిస్తున్నాయి. వీటి అన్నిటికన్నా మెయిన్ గా డైరెక్టర్ సుధీర్ వర్మ రవితేజ రోల్ ని చాలా యూనిక్ గా ప్రెజెంట్ చేస్తూ చూపించిన సీన్స్ హైలైట్ అయ్యాయి. మొత్తానికి అయితే ఈ ట్రైలర్ మంచి ప్రామిసింగ్ గా ఉందని చెప్పడంలో డౌట్ లేదు. ఇక ఈ ఏప్రిల్ 7న వచ్చే సినిమా ఎలా ఉంటుందో చూడాల్సిందే.