ఆ హీరోతో నటిస్తే ఊరుకునేది లేదు.. కూతురికి వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్!

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీల పిల్లలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పెద్ద ఎత్తున సినిమాలలో నటిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా ప్రముఖ డైరెక్టర్ శంకర్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టారు అదితి శంకర్. ఈమె కార్తీ నటించిన విరుమాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా హిట్ కొట్టకపోయినా ఈ సినిమా ద్వారా ఈమె నటనకు ప్రశంసలు దక్కాయి.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అతిథి శంకర్ తన తండ్రి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఈమె మాట్లాడుతూ నేను సినిమాలలోకి రావడం తన తండ్రికి ఏమాత్రం ఇష్టం లేదని తెలిపారు అయితే తనకు సినిమాలపై ఆసక్తి ఉండడంతో తన మాట కాదనలేక తన ఇష్ట ప్రకారమే సినిమాలలో నటించడానికి ఒప్పుకున్నానని ఈ సందర్భంగా అతిథి శంకర్ పేర్కొన్నారు. ఇకపోతే తన తండ్రి ఓ విషయంలో తనకు బాగా వార్నింగ్ ఇచ్చిన సంగతి కూడా ఈమె వెల్లడించారు. తను సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోతో అయినా నటించిన తాను ఒప్పుకుంటానని ఒక హీరోతో మాత్రం నటిస్తే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపారు.

మరి శంకర్ కుమార్తె ఏ హీరోతో నటించకూడదని వార్నింగ్ ఇచ్చారనే విషయానికి వస్తే… కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు శింబుతో మాత్రం నటించవద్దు అంటూ శంకర్ తన కుమార్తెకు వార్నింగ్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే శంకర్ ఇలా వార్నింగ్ ఇవ్వడానికి కూడా ఓ కారణం ఉందని కేవలం తన ప్రేమ వ్యవహారాల కారణంగానే ఆ హీరోతో నటించవద్దు అంటూ తన కూతురికి వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం అదితి శంకర్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.