‎Maheswari: ఆ స్టార్ హీరో మీద మనసుపడితే చెల్లి అనేశాడు.. హీరోయిన్ మహేశ్వరీ కామెంట్స్ వైరల్!

‎Maheswari: ఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్ మహేశ్వరి గురించి మనందరికీ తెలిసిందే. ఈమె పేరు చెప్పగానే ముందుగా పెళ్లి, గులాబీ వంటి సినిమాల పేర్లు గుర్తుకువస్తాయి. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల అందరి సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. అయితే ఒకప్పుడు వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడిపిన ఈమె ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. ఇకపోతే ఇటీవల కాలంలో చాలా మంది ఒకప్పటి హీరోయిన్ లు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు.

‎కానీ మహేశ్వరీ మాత్రం సినిమాలకు దూరం అయ్యారు. ఒకానొక సమయంలో తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ ఎన్నో చిత్రాల్లో నటించి ఒక వెలుగు వెలుగు వెలిగింది. కానీ పెళ్లి తరువాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయింది. 1995లో అమ్మాయి కాపురం సినిమాతో తెలుగు తెరకు పరియమైంది ఈ క్యూట్ హీరోయిన్. ఆ తర్వాత జెడీ చక్రవర్తి నటించిన గులాబీ సినిమాలో మరోసారి కనిపించింది. ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. దీంతో మహేశ్వరికి ఫుల్ ఫాలోయింగ్ వచ్చేసింది. ఆ తర్వాత వడ్డే నవీన్ నటించిన పెళ్లి సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది మహేశ్వరి.

‎అలా 2003 నుంచి 2014లో తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. మహేశ్వరి చివరిసారిగా తిరుమల తిరుపతి వెంకటేశా సినిమాలో కనిపించింది. ఆ తర్వాత సినిమాల నుంచి దూరమయ్యింది. ఇటీవల ఆమె జగపతిబాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ షోలో ఆమె మాట్లాడుతూ ఆసక్తిగా కామెంట్స్ చేసింది. ఈ సందర్బంగా హీరోయిన్ మహేశ్వరీ మాట్లాడుతూ.. నాకు తమిళ నటుడు అజిత్ అంటే చాలా ఇష్టం ఆయనతో కలిసి నటించాను. అప్పుడే అజిత్ పై మనసు పడ్డాను. ఆయన నా క్రష్.. అజిత్ కు ఆ విషయం చెప్పే లోగా సినిమా షూటింగ్ చివరి రోజు. నా దగ్గరకు వచ్చి. నీ వర్క్ నాకు బాగా నచ్చింది. నీకు ఫ్యూచర్ లో ఎలాంటి హెల్ప్ కావాలన్న నన్ను అడుగు. నువ్వు నాకు చెల్లిలాంటిదాని అని అన్నారు. దాంతో నేను షాక్ అయ్యాను అంటూ సరదాగా తెలిపారు మహేశ్వరి. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహేశ్వరీ మాటలకు జగపతి బాబు కూడా పక పక నవ్వేశారు.