‎Director Vetrimaaran: ఇదే చివరి సినిమా.. సంచలన నిర్ణయం తీసుకున్న డైరెక్టర్.. అసలేం జరిగిందంటే!

Director Vetrimaaran: తమిళ దర్శకుడు వెట్రిమారన్ గురించి మనందరికీ తెలిసిందే. మొదట 2007లో విడుదల అయిన పొల్లాదవన్ అనే సినిమా ఇండస్ట్రీకి దర్శకుడిగా తమిళ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్టుగా నిలిచింది. మొదటి సినిమాతోనే డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వెట్రిమారన్. ఆ తర్వాత తమిళంలో చాలా సినిమాలను తెరకెక్కించి డైరెక్టర్గా మరింత గుర్తింపు తెచ్చుకున్నారు.

‎ఒకవైపు దర్శకుడుగా మంచి మంచి సినిమాలను తెరకెక్కిస్తూనే మరొకవైపు సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించి నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు. 2012లో క్రాస్ రూట్స్ ఫిల్మ్ కంపెనీ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ నిర్మాణ సంస్థలో ఉదయమ్ NH4, పోరియాలన్, కాకా ముట్టై, ఇనారి, కోడి, అన్నంకు జై, వడ చెన్నై వంటి చిత్రాలను కూడా నిర్మించారు. అలాగే ఇప్పుడు విడుదల కోసం ఎదురుచూస్తున్న బ్యాడ్ గర్ల్ మూవీని సైతం నిర్మించారు. అయితే ఈ మూవీ విడుదల కోసం అతడు సెన్సార్ బోర్డుతో పోరాడాల్సి వచ్చిందట.

https://x.com/CinemaWithAB/status/1962453553748086977?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1962453553748086977%7Ctwgr%5E18f12ec11cd58067c5dc80511566e7e60bcedec3%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fdirector-vetrimaaran-decides-to-shut-down-his-production-company-1617988.html

‎ దీంతో వెట్రిమారన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలు నిర్మించడం చాలా కష్టమైన పని, అందుకే తన నిర్మాణ సంస్థను మూసివేస్తున్నట్లు ప్రకటిస్తూ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దర్శకుడిగా ఉండడం సులభం. కానీ నిర్మాతగా సినిమాలను నిర్మించడం అంత సులభం కాదు. దర్శకుడిగా ఉంటే మన మనం చేసుకోవడం మాత్రమే. కానీ నిర్మాత అయితే మాత్రం ప్రతి విషయం గురించి తెలుసుకోవాలి. చివరికీ టీజర్ కింద వచ్చే కామెంట్స్ కూడా చదవాలి. నటీనటులు, ప్రకటనలు సినిమా వ్యాపారాన్ని ప్రభావితం చేస్తాయి. ఆండ్రియా # మానుషి రివైజింగ్ కమిటీ, కోర్టు ద్వారా వెళ్లింది. #బ్యాడ్ గర్ల్ సినిమా కూడా అనేక పోరాటాలతో కోర్టు వరకు వెళ్లింది. చిన్న నిర్మాత మనుగడ సాగించడం కష్టం. కాబట్టి మేము మా నిర్మాణాన్ని మూసివేస్తున్నాము అని ఆయన చెప్పుకొచ్చారు. కాగా ఈ సందర్బంగా వెట్రిమారన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.