ఇకపై అసలు హీరోల అసలు కథ మొదలు

సినిమా ఇండస్ట్రీలో హీరోగా నిలబడటం ఎంత కష్టమో ఒకసారి స్టార్ హీరోగా ఫేమ్ వచ్చాక దానిని కొనసాగించడం కూడా అంతే కష్టం. చాలా మంది హీరోలు కెరియర్ ఆరంభంలో వరుస సక్సెస్ లు అందుకొని స్టార్ హీరో రేంజ్ ఇమేజ్ తెచ్చుకొని తరువాత దానిని కొనసాగించలేక క్రిందపడిపోతారు. స్టొరీ సెలక్షన్ లో లోపాల కారణంగా కెరియర్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అలాంటి హీరోలు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో మన స్టార్ హీరోల పరిస్థితి కూడా ఇంచుమించు అదే అని చెప్పాలి.

ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలైన ప్రభాస్, రామ్ చరణ్, తారక్, అల్లు అర్జున్, మహేష్ బాబులకి పాన్ ఇండియా ఇమేజ్ ఉంది. అయితే ఇప్పుడు వీరు చేయబోయే సినిమాలు వారి కెరియర్ పరంగా చాలా కీలకం అని చెప్పాలి. డార్లింగ్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఐదు పాన్ ఇండియా సినిమాల వరకు ఉన్నాయి. అయితే జూన్ లో ఆదిపురుష్, సెప్టెంబర్ లో సలార్ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు ప్రభాస్ కి పాన్ ఇండియా ఇమేజ్ ని కొనసాగించడంలో చాలా కీలకంగా ఉంటాయని చెప్పాలి. వీటి సక్సెస్ బట్టి నెక్స్ట్ ఆయన మీద అంచనాలు ఉంటాయి.

ఇక అల్లు అర్జున్ కి పుష్పతో పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన దానిని కొనసాగించాలంటే పుష్ప 2 మూవీ రిజల్ట్ చాలా కీలకంగా ఉండబోతుంది. ఇక ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చేస్తున్న మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ సినిమా తనని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లడంలో ఎంత వరకు ఉపయోగపడుతుంది అనేది చూడాలి. గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ ని నిలుపుకోవాలంటే అది బ్లాక్ బస్టర్ హిట్ కావాలి.

అలాగే తారక్ కి కూడా గ్లోబల్ స్టార్ బ్రాండ్ ని మెయింటేన్ చేయాలంటే కొరటాల దర్శకత్వంలో చేస్తున్న సినిమా కచ్చితంగా హై అండ్ లో ఉండాలి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు జక్కన్నతో చేస్తున్న సినిమా తర్వాత అతని ఇమేజ్ అమాంతం పెరిగిపోతుంది. దానిని క్యారీ చేయాలంటే అంతకంటే స్ట్రాంగ్ కంటెంట్ సినిమాలు నెక్స్ట్ పడాల్సిందే. ఇలా మన స్టార్ హీరోలు ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో పాన్ ఇండియా ఇమేజ్ ని నిలుపుకోవడంతో పాటు నెక్స్ట్ కొనసాగించడానికి చాలా వెయిట్ మోయాల్సి ఉంటుందని కచ్చితంగా చెప్పొచ్చు.