టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా గుర్తింపు పొందిన ఆలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని వందలకు పైగా సినిమాలలో కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా నటించిన అలీ ప్రస్తుతం బుల్లితెర మీద ప్రచారం అవుతున్న టీవీ షోలలో కూడా సందడి చేస్తున్నాడు. ఈటీవీలో ప్రసారమవుతున్న అలీతో సరదాగా అనే టీవీ షోలో హోస్ట్ వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇలా సినిమాలు టీవీ షోలతో బిజీగా ఉన్న అలీ కి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక పదవి లభించింది.
2019లో జరిగిన ఎన్నికల్లో అలీ తన స్నేహితుడైన పవన్ కళ్యాణ్ పార్టీలో చేరకుండా వైసీపీ పార్టీలో చేరి అందరికీ షాక్ ఇచ్చాడు. ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ తరపున భారీ ఎత్తున ప్రచారం కూడా నిర్వహించాడు. అయితే అలీ ఇలా వైసీపీ లోకి చేరటంతో అలీపై పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించాడు. అలీ కూడా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశాడు. ఎన్నో ఏళ్లుగా పవన్ కళ్యాణ్ అలీ మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఇలా పవన్ కళ్యాణ్ నటించిన ప్రతి సినిమాలోనూ అలీ కోసం దర్శకులు ఒక పాత్ర క్రియేట్ చేసేవారు. కానీ 2019 ఎన్నికలు వీరి స్నేహబంధం లో చిచ్చుపెట్టాయి. అప్పటినుండి వీరిద్దరి మధ్య మాటలు లేవని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇటీవల ఈ వార్తలపై స్పందించిన అలీ.. రాజకీయం వేరు స్నేహం వేరు. మా ఇద్దరి మధ్య స్నేహం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. తొందర్లోనే పవన్ కళ్యాణ్ నటించబోయే సినిమాలో నటిస్తాను అని చెప్పుకొచ్చాడు. ఇక గతేడాది విడుదలైన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలలో నటించలేదు అని విలేకరి ప్రశ్నించగా.. ఆ సినిమాలో కామెడీ లేదు అందుకే నేను నటించలేదు అంటూ వారిద్దరి మధ్య స్నేహబంధం కొనసాగుతోంది అని చెప్పటానికి ప్రయత్నం చేశాడు. కానీ భీమ్లా నాయక్ సినిమాలో ఎంతోమంది కమెడియన్లు చిన్న చిన్న పాత్రలలో నటించారు. కానీ అలీ మాత్రం ఆ సినిమాలో కనిపించలేదు. అందువల్ల పవన్ కళ్యాణ్, అలీ మధ్య ఉన్న స్నేహ బంధానికి పులిస్టాప్ పడిందని వార్తలు వినిపిస్తున్నాయి.