క్రేజీ : “వీరసింహా రెడ్డి”తో “అఖండ” వార్నింగ్స్ ఇస్తున్న థమన్.!

ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ మోస్ట్ సంగీత దర్శకునిగా ఎస్ ఎస్ థమన్ నిలిచాడు. ఒక్కో సినిమాకి కూడా గతంలోలా కాకుండా చాలా డిఫరెంట్ ట్యూన్స్ అయితే ఇస్తూ అదరగొడుతున్నాడు. ఇక ఇదిలా ఉండగా తన సంగీతం రీసెంట్ గా బాగా పీక్ కి వెళ్లిన చిత్రాల్లో గత ఏడాది వచ్చిన చిత్రం “అఖండ” కూడా ఒకటి.

బాలయ్యతో అది మరో సినిమా కాగా ఆ సినిమాకి ఏ రేంజ్ సౌండ్ ఇచ్చాడో అందరికీ తెలిసిందే. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ థియేటర్స్ లో కూడా తన సౌండ్ కి బాక్సులు బద్దలవ్వడం మళ్ళీ వాటిని మార్పించడం అఖండ సౌండ్ కి స్పీకర్ లు షార్ట్ సర్క్యూట్ అవ్వడం కూడా విన్నాం.

మరి మళ్ళీ వెంటనే థమన్ తో బాలయ్య “వీరసింహా రెడ్డి” అనే మరో సినిమా అనౌన్స్ చేయడం ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ సాంగ్ కూడా వస్తుండడం ఆసక్తిగా మారింది. అయితే ఈ సినిమా ఫస్ట్ సాంగ్ కె తన సౌండ్ బాక్స్ బద్దలైపోయినట్టుగా థమన్ షేర్ చేసిన ఓ ఫోటో బయటకి వచ్చింది.

వీరసింహా రెడ్డి సాంగ్ ఫైనల్ అవుట్ పుట్ కి బాక్స్ బద్దలైనట్టుగా తాను చూపించాడు. దీనితో అయితే ముందే అఖండ రోజులు గుర్తు చేస్తూ థియేటర్స్ కి వార్నింగ్ లు ఇస్తున్నాడని చెప్పాలి. ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది.