Akhanda 2: టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలయ్య బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే గత నాలుగు సినిమాలతో డబులు హ్యాట్రిక్ లను అందుకున్న విషయం తెలిసిందే. అఖండ, వీర సింహా రెడ్డి, డాకు మహారాజ్, భగవంత్ కేసరి వంటి నాలుగు సినిమాలతో వరుస హిట్ లను అందుకున్నారు బాలకృష్ణ. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య అఖండ 2 సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఈ సినిమా గతంలో విడుదల అయిన అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కతున్న విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెల కొన్నాయి. ఇకపోతే అఖండ 2 కీ తమన్ సంగీతాన్ని అందీస్తున్న విషయం తెలిసిందే. అఖండ సినిమాకు ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఏ రేంజ్ లో వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక పక్క మాస్ బీజీఎమ్ తో మెంటలెక్కిస్తూనే మరోపక్క డివోషనల్ మ్యూజిక్ తో ఆడియన్స్ ను అల్లరిస్తున్నారు తమన్. అఖండ సినిమా విజయంలో కీలక పాత్ర అంటే తమన్ అనే చెప్పాలి.
అంతటి క్రేజ్ ఉన్న అఖండ సీక్వెల్ కి అంతకుమించి అన్న రేంజ్ లో మ్యూజిక్ అందించాలని ప్లాన్ చేస్తున్నాడట తమన్. అందులో భాగంగానే ఆడియన్స్ కి సరికొత్త ఫీలింగ్ కలిగించేలా మిశ్రా ద్వయాన్ని రంగంలోకి దించుతున్నాడు. ఈ మిశ్రా ద్వయం మరెవరో కాదు. సంస్కృత శ్లోకాలు చెప్పడంలో నిష్ణాతులు పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా. వీరి మంత్రోచ్ఛారణ వింటే ఎలాంటి వారికైనా పూనకం రావడం ఖాయం. వీరికి సంబంధించిన వీడియోలు కూడా ఇప్పటికే చాలా సార్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అలాంటి వారిని ఇప్పుడు అఖండ 2 కోసం రంగంలోకి దించాడు తమన్. వీళ్లు పలికే సంస్కృత శ్లోకాలు, వేదమంత్రాలు అఖండ 2 బీజీఎమ్ ను మరింత స్పెషల్ గా మార్చబోతుందట. ఈ ఒక్క న్యూస్ తో అఖండ 2 సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఇక బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వస్తున్న అఖండ 2 సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరీ ఈ సినిమా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరీ..
