క్రేజీ : సోషల్ మీడియాని షేక్ చేసిన “జవాన్” లీక్.!

Jawan Movie

చాలా కాలం తర్వాత బాలీవుడ్ సినిమా కోరుకుంటున్న మాసివ్ హిట్స్ మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “పఠాన్” తో బాలీవుడ్ నుంచి మరో 1000 కోట్ల సినిమాగా ఇది నిలవగా ఇక నుంచి షారుఖ్ నుంచి వచ్చే సినిమాలు హిట్ గాని అయితే ఎలా ఉంటుందో ఈ సినిమా చూపించింది.

దీనితో ఇక నెక్స్ట్ నుంచి షారుఖ్ నటిస్తున్న సినిమాలపై  నెక్స్ట్ లెవెల్ హైప్ నెలకొనగా ఈ చిత్రాల్లో కోలీవుడ్ దర్శకుడు అట్లీ తో చేస్తున్న సినిమా “జవాన్” కూడా ఒకటి. కాగా ఈ సినిమా నుంచి రిలీజ్చేసిన టైటిల్ టీజర్ తోనే సెన్సేషనల్ హైప్ సెట్టయ్యింది. పైగా ఈ మధ్య ఓ స్టార్ హీరో క్యామియో అంటూ కూడా గట్టి రూమర్స్ మొదలయ్యాయి.

అయితే ఈ సినిమా నుంచి ఇప్పుడు అనుకోని విధంగా ఓ లీక్ షాక్ సోషల్ మీడియాని షేక్ చేసి వదిలేసింది. ఈ సినిమా నుంచి ఓ 10 సెకండ్స్ మేర అంతకన్నా తక్కువే ఉన్న చిన్న వీడియో బిట్ ఒకటి లీక్ అయ్యింది. అది కూడా ఓ ఊహించని మైండ్ బ్లోయింగ్ యాక్షన్ బ్లాక్ నుంచి కావడంతో అది చూసిన షారుఖ్ ఫ్యాన్స్ వెర్రెత్తి పోతున్నారు.

ఇది పఠాన్ ని మించి పోయేలా ఉందని క్రేజీ గా మాట్లాడుకుంటున్నారు. దీనితో వెంటనే అప్రమత్తమైన మేకర్స్ అయితే వెంటనే సోషల్ మీడియా నుంచి వీడియోలు అన్నిటిని తొలగించారు కానీ పూర్తి స్థాయిలో అరికట్టలేకపోయారు. అలాగే షారుఖ్ టీం వారు దయచేసి ఇలాంటి లీక్స్ ని ఎవరూ ప్రోత్సహించవద్దని వేడుకుంటున్నారు ఏది ఏమైనప్పటికీ మాత్రం ఇప్పుడు పఠాన్ దాటి జవాన్ మేనియా సోషల్ మీడియాలో గట్టిగా స్ప్రెడ్ అవుతుంది.