Allu Arjun-Atlee: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ అలాగే స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు. ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాకముందే అంచనాలు ఒక రేంజ్ లో ఏర్పడ్డాయి. దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదల అయిన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. కాగా ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చాయని తెలుస్తోంది.
త్వరలోనే షూటింగ్ కు అంత సిద్ధం చేసి షూటింగ్ నీ కూడా మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అనేక రకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే ఈ సినిమా కోసం డైరెక్టర్ అట్లీ ఏకంగా హాలీవుడ్ హీరోని రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. తెలుగు సినిమా ఇప్పుడు బాలీవుడ్ ను దాటి అంతర్జాతీయ రేంజ్ కు చేరిపోయింది. దీంతో హాలీవుడ్ టాప్ నటులను కూడా మన సినిమాల్లో భాగం చేసుకుంటున్నారు. తాజాగా AA22 ప్రాజెక్ట్ నుంచి ఒక వార్త వైరల్ గా మారింది.
సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్ తో అల్లు అర్జున్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గ్రాఫిక్స్ పనుల కోసం ప్రముఖ హాలీవుడ్ సంస్థ పనిచేస్తుంది. అయితే ఇప్పుడు ఈ మూవీలో విలన్ గా హాలీవుడ్ స్టార్ నటుడు విల్ స్మిత్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే వార్త నిజమైతే ఈ సినిమా పాన్ ఇండియా నుంచి ఇంటర్‌నేషనల్ వరకు రీచ్ కావడం ఖాయం అని చెప్పవచ్చు. కాగా హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ ఆస్కార్ అవార్డు గ్రహీత అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విల్ స్మిత్ విలన్ గా నటించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
