‘సలార్‌’ ఓటిటికి అప్పుడే బిజినెస్‌.. 200కోట్లకు సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్‌!

’సలార్‌’ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ప్లిక్స్‌ సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేశారు. నెట్‌ప్లిక్స్‌ ఓటీటీలో ఆ ఐదు భాషల్లోనూ సినిమా స్టీమ్రింగ్‌ కానుంది.

’సలార్‌’ థియేటర్లలో విడుదల అయ్యే వరకు ఓటీటీ పార్ట్నర్‌ ఎవరు అనేది రివీల్‌ చేయలేదు. సిల్వర్‌ స్క్రీన్‌ విూద తమ డిజిటల్‌ పార్ట్నర్‌ నెట్‌ప్లిక్స్‌ అని అనౌన్స్‌ చేశారు. సుమారు 200 కోట్లకు అటు ఇటుగా డీల్‌ జరిగిందని టాక్‌.

ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసిందని ఇండస్టీ వర్గాలు చెబుతున్నాయి. థియేటర్లలో విడుదలైన ఎన్ని వారాలకు ఈ సినిమా ఓటీటీలో వస్తుందనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.