Prabhas: ప్రభాస్ వంటకాలలో ఆ వంటకం రుచి వేరే లెవెల్… ప్రతి ఒక్కరూ రుచి చూడాల్సిందే!

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి కూడా అందరికీ తెలిసిందే. ప్రభాస్ పెట్టే ఫుడ్ గురించి ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఎంతో గొప్పగా వివరించారు. తాజాగా నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ సైతం ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి మాట్లాడారు.

ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాలో ఆయన స్నేహితుడి పాత్రలో పృథ్వీరాజ్ నటించిన సంగతి తెలిసిందే అయితే ఆ సమయంలో పృథ్విరాజ్ ఫ్యామిలీ కోసం ప్రభాస్ పంపించిన ఫుడ్ ఒక రూమ్ సరిపోక మరొక రూమ్ కూడా తీసుకోవాల్సి వచ్చిందని తెలియజేశారు. అయితే తాజాగా మరోసారి కూడా ప్రభాస్ పంపిన ఫుడ్ గురించి ఈయన మాట్లాడారు. మోహన్ లాల్ హీరోగా నటించిన లూసిఫర్ 2 సినిమా ఈనెల 27 న విడుదల కాబోతోంది.

ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ..ప్రభాస్ పంపిన మటన్‌ అంటే నాకు చాలా ఇష్టం అని .. మరీ ముఖ్యంగా మటన్‌తో చేసిన వంటకం నాకు చాలా బాగా నచ్చిందని పృథ్వీరాజ్‌ సుకుమారన్ తెలిపారు. ఈ మటన్ వంటకాన్ని ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ చేయాల్సిందే అంటూ పృథ్విరాజ్ సుకుమారన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.