Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మరోసారి వార్తల్లో నిలిచారు. ఏపీ పోలీసులు ఆయన కోసం గాలిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. అందులో తాను ఎవరికి భయపడటంలేదని, తన షూటింగ్ షెడ్యూల్ వల్లే పోలీసుల విచారణకు హాజరుకాలేదని చెప్పారు. అయితే, తాజాగా మరో మీడియా ఇంటర్వ్యూలో ఆయన మరింత మరింత స్పష్టతతో తన భావాలను వ్యక్తం చేశారు.
Ram Gopal Varma: ఆర్జీవీ ఫోన్ స్విచ్ఛాఫ్…!
తన కోసం పోలీసులు వెతుకుతున్నారని వస్తున్న వార్తలపై ఆర్జీవీ (Ram Gopal Varma) స్పందిస్తూ, “నేను ఎక్కడికీ పారిపోలేదు. నా ఆఫీస్‌లోనే ఉన్నాను. ఒకవేళ పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తే, నేను జైల్లో కూర్చుని కథలు రాస్తాను. అది కూడా ఒక సృజనాత్మక ప్రయోగంగా భావిస్తాను” అంటూ వ్యాఖ్యానించారు. తనపై నమోదైన కేసుల విషయంలో ఎలాంటి ఆందోళన లేదని స్పష్టం చేశారు.
తనపై కేసులు నమోదు చేసిన ఒంగోలు పోలీసులు ఇంకా తన దగ్గరకు రాకపోయారని ఆర్జీవీ (Ram Gopal Varma) పేర్కొన్నారు. “వాళ్లు ఇప్పటివరకు నా ఆఫీస్‌లో అడుగుపెట్టలేదు. నా మీద ఉన్న కేసుల గురించి తెలుసుకోవడానికి వెనుకాడతే ఎలా? వాళ్లు వచ్చేవరకు నేను ఇక్కడే ఉంటాను” అంటూ సవాల్ విసిరారు. ఇక తనను పరామర్శించడానికి పలువురు ఫోన్ చేస్తుండటంతో ఆ ఫోన్ స్విచ్ఛాఫ్ చేశానని వెల్లడించారు. “నాకు ఎలాంటి సహానుభూతి అవసరం లేదు. ఈ పరిస్థితుల్లో నన్ను నేను రక్షించుకోగలను. అందుకే ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేశాను” అని వివరించారు. మరి వర్మ (Ram Gopal Varma) ఈ కేసును కోర్టులో ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.