Ram Gopal Varma: ఆర్జీవీ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌…!

Ram Gopal Varma: ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan), మంత్రి నారా లోకేష్‌ ఫొటోలు మార్ఫింగ్‌ చేసి ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన కేసులో ప్రముఖ టాలీవుడ్‌ డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ (Ram Gopal Varma) విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో కేసు నమోదైంది.

ముందుగా ఈ కేసులో నవంబర్‌ 19 (మంగళవారం)న విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపినప్పటికీ హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో మరోసారి నోటీసులు పంపించిన మేరకు నేడు విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. రాలేనంటూ లాయర్‌ ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు వర్మ (Ram Gopal Varma). దీంతో రంగంలోకి దిగిన ఒంగోలు పోలీసులు హైదరాబాద్‌లోని ఆర్జీవీ ఇంటికి వెళ్లారు. అయితే వర్మ అక్కడ లేకపోవడంతో పోలీసులు గాలింపు చేపడుతున్నారు.

Ram Gopal Varma: కేసు విచారణకు రాంగోపాల్‌ వర్మ డుమ్మా.. 25న విచారణ కావాలని మళ్లీ నోటీసులు

వర్మ ఫోన్‌ స్విచాఫ్‌ అని వస్తుందని తెలుస్తోంది. వర్మ తాను కోయంబత్తూరులో ఉన్నట్టు ట్వీట్‌ చేయగా.. మరోవైపు సోషల్‌ మీడియాలో అకౌంట్‌ హ్యాండిల్స్‌ మాత్రం హైదరాబాద్‌లోనే చూపిస్తున్నాయట. వర్మకు (Ram Gopal Varma) ఓ ప్రముఖ నటుడు తన ఫాంహౌజ్‌లో ఆశ్రయం ఇచ్చినట్టుగా వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఈ మేరకు శంషాబాద్‌, షాద్‌ నగర్‌ దగ్గర రెండు ఫాంహౌజ్‌లపై ఏపీ పోలీసులు ఫోకస్‌ పెట్టినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వర్మ (Ram Gopal Varma) ఇంతకీ ఎక్కడున్నారో మరి అంటూ నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.

Senior Journalist Bharadwaj Reveals REAL Facts Behind ADANI Case Issue || YS Jagan || Telugu Rajyam