రాజీవ్ కనకాల కాళ్లపై పడాలంటూ ఇంట్లో మనిషే షాకింగ్ ఆర్డర్.. వైరల్ వీడియో?

తెలుగు బుల్లితెరపై మకుటంలేని మహారాణిగా స్టార్ మహిళగా కొనసాగుతున్న యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగమ్మాయి కాకపోయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిగా తెలుగు ఎంతో అనర్గళంగా మాట్లాడుతూ గత దశాబ్దాల నుంచి తెలుగు బుల్లితెరపై యాంకర్ గా వ్యవహరిస్తూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా బుల్లితెరపై ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమ తాజాగా జయమ్మ పంచాయతీ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రం ద్వారా వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది.

కెరియర్ పరంగా సుమ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే సుమ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా సుమ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు. నేడు సుమ భర్త రాజీవ్ కనకాల పుట్టిన రోజు కావడంతో సుమ తనకు సర్ప్రైస్ ఇస్తూ అతనితో కేక్ కట్ చేయించింది. ఈ క్రమంలోనే ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

తన భర్తతో కేక్ కట్ చేయించిన సుమ అనంతరం తన కుటుంబ సభ్యులు సుమకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.తన భర్త పుట్టినరోజు కావడంతో తను తన భర్త కాళ్ళపై పడి నమస్కరించి తన ఆశీర్వాదం తీసుకోవాలని తన కుటుంబ సభ్యులు సూచించారు. ఈ క్రమంలోనే సుమ తన భర్త రాజీవ్ కనకాల కాళ్ళపై పడి నమస్కరించింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు తన భర్త పుట్టినరోజు సుమ అతని కాళ్ళపై పడి ఆశీర్వాదం తీసుకోవడం ఏంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా సుమ ఈ విధంగా తన భర్త కాళ్ళపై పడి ఆశీర్వాదాలు తీసుకోవడం ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.