Vidhata: ఘనంగా “విధాత” మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్, త్వరలో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ

Vidhata: ఏబీసీ ప్రొడక్షన్ పతాకం పై భాస్కర్, కోటేశ్వర రావు ప్రధాన పాత్రదారులుగా మణికంఠ రాజేంద్ర బాబు దర్శకత్వం లో అప్పిన పల్లి భాస్కరాచారి నిర్మించిన చిత్రం “విధాత”. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

దర్శకుడు మణికంఠ రాజేంద్రబాబు మాట్లాడుతూ – సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించాను. ఇక్కడ లభించని అవకాశం మా ఊరిలో మా ప్రొడ్యూసర్ భాస్కరాచారి గారి రూపంలో దక్కింది. నేను షార్ట్ ఫిలిం చేద్దామనే ప్రయత్నంలో ఉండగా, ఆయన సినిమా చేద్దామని ప్రపోజల్ చేశారు. మా ఇంటికే వచ్చి ఆయన ఆఫర్ ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సినిమాలో కీలక పాత్రలో భాస్కరాచారి గారు నటించారు. ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించడమే కాదు ముఖ్య పాత్రలో ఎంతో డెడికేషన్ తో నటించారు. ఒక సీన్ కోసం రోజంతా భోజనం చేయకుండా ఉండి నటించారు. మా విధాత సినిమాకు మీరంతా సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.

VIDHAATA MOVIE _Allammurabba 4k _Lyrical song

అతిథిగా వచ్చిన నటుడు కాదంబరి కిరణ్ మాట్లాడుతూ – ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పలు పోరాటాల రూపంలో విధాత అడుగుపెడతాడు. తప్పుచేసిన వారిని శిక్షిస్తాడు. పేదవారి పక్షాన, బలహీన పక్షాన నిలబడతాడు. అలాంటి గొప్ప టైటిల్ తో మణికంఠ, భాస్కరచారి గార్లు సినిమా చేయడం అభినందనీయం. విధాత సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమాను మీడియా మిత్రులు, ప్రేక్షకులు సపోర్ట్ చేయాలి. ఇలాంటి చిన్న చిత్రాలకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తమ సహకారం అందించాలి. అన్నారు.

నిర్మాత డాక్టర్ అప్పిన పల్లి భాస్కరాచారి మాట్లాడుతూ – మా విధాత సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. కొన్ని వాస్తవ ఘటనల నేపథ్యంతో ఈ సినిమాను నిర్మించాం. కథా కథనాలు, పాత్రల చిత్ర ఎంతో సహజంగా ఉంటూ ఆకట్టుకుంటాయి. ఈ చిత్రంలో నేను ప్రధాన పాత్రలో నటించాను. ప్రేక్షకుల్లో ఒక స్ఫూర్తిని నింపేలా మా విధాత సినిమా ఉంటుంది. త్వరలోనే మంచి డేట్ చూసి సినిమాను థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తాం. అన్నారు.

VIDHAATA MOVIE TRAILER | Appinapalli Bhaskarachari | Manikanta Rajendrababu

మ్యూజిక్ డైరెక్టర్ డ్రమ్స్ రాము మాట్లాడుతూ – మా విధాత సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన ప్రతి గెస్ట్ కు ఇతర అతిథులకు థ్యాంక్స్. సంగీత పరంగా మంచి ప్రాధాన్యత ఉన్న చిత్రమిది. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇలాంటి చిన్న చిత్రాలకు ఆదరణ లభిస్తేనే ఇండస్ట్రీ బాగుంటుంది. అన్నారు.

ఈ కార్యక్రమంలో దైవజ్ఞ శర్మ, ఇతర నటీనటులు, మూవీ టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు.

నటీనటులు – భాస్కర్, కోటేశ్వరరావు, సుమ ,రాఘవేందర్ రెడ్డి, చిన్ని, దినకర్, అప్పల బట్ల సురేష్ ,ఉదయ్ కుమార్, తదితరులు

టెక్నికల్ టీమ్
సంగీతం: డ్రమ్స్ రాము,
డాన్స్: బాలు ,
సింగర్స్: సింధుజ శ్రీనివాసన్, నందకిషోర్
మాటలు, పాటలు:అప్పల బట్ల సురేష్
నిర్మాత: డాక్టర్ అప్పిన పల్లి భాస్కరాచారి ,
దర్శకత్వం: మణికంఠ రాజేంద్ర బాబు MFA
పీఆర్ఓ – వీరబాబు

VIDHAATA MOVIE TEASER