RRR: అనుకున్నట్టుగానే ఆర్ ఆర్ ఆర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ను చిక్బలాపూర్ లో అంగరంగ వైభవంగా జరిపారు. ఈ వేడుక జన సందోహం నడుము కన్నుల పండుగగా జరిగింది.వేదికకి కనుచూపు మేరలో జన ప్రవాహం కనిపిస్తోంది. అయితే ఈ వేడుకకుు కర్ణాటక ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా ఇంకా కర్ణాటక హెల్త్ మినిష్టర్ గౌరవ అతిథిగా అలాగే కన్నడ స్టార్ హీరో శివరాజ్ఈ కుమార్ ప్రత్యేక అతిథిగా ఈ వేడుకకి విచ్చేశారు.
ఈ వేడుకలో రాజమౌళి, చిరంజీవి ఉద్వేగపూరితమైన ప్రసంగం చేశారు. చిరంజీవి గారికి ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం నచ్చదు..ఇండస్ట్రీ బిడ్డ అనిపించుకోవడం ఇష్టం..కానీ నాకు మాత్రం చిరంజీవి గారే ఇండస్ట్రీకి పెద్ద…అని ఆయన చెప్పారు. ఏపీ గవర్నమెంట్ సినిమా టికెట్లు పై తీసుకువచ్చిన కొత్త జీవో గురించి మాట్లాడటానికి ఇండస్ట్రీ అంతా ట్రై చేసింది, కానీ ఎవరూ ముందుకు వెళ్ళలేక పోయారు. అప్పుడు చిరంజీవి గారు రెండు మూడు సార్లు సీఎంను కలిసి తన సాన్నిహిత్యం ఉపయోగించి సమస్యను వివరించి కొత్త జీవో రావడానికి కారణమయ్యారు.
అప్పుడు ఆ సమయంలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు, పట్టించుకోకుండా తగ్గి మమ్మల్ని గెలిపించారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే..యూ ఆర్ ఏ ట్రూ మెగాస్టార్. ఏపీ గవర్నమెంట్ జీవో నే కాదు తెలంగాణ ప్రభుత్వం ముందు వచ్చిన జీవో కూడా రావడానికి మెగాస్టార్ ఏ కారణం. మరొకసారి చెప్తున్నాను నాకు మాత్రం ఇండస్ట్రీకి పెద్ద అంటే మెగాస్టార్ చిరంజీవి నే. ఇండస్ట్రీ పెద్దగా ఆయననే గౌరవిస్తాను. నేనే కాదు ఇండస్ట్రీ మొత్తం ఆయనకు రుణపడి ఉండాలి. సంచలన వ్యాఖ్యలు చేశారు రాజమౌళి.