Lokesh Kanagaraj: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దర్శకుడు లోకేష్ కనగ రాజ్ ఒకరు. తాజాగా ఈయన కూలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా హైదరాబాద్లో చిత్ర బృందం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో రజినీకాంత్ మినహా మిగిలిన చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో డైరెక్టర్ లోకేష్ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తి కరమైన విషయాలను తెలియజేశారు. ఈ సినిమాలో నాగార్జున గారు నటించిన సైమన్ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని తెలిపారు. థియేటర్లలో ఆయన పాత్ర చూస్తే ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు అంటూ నాగార్జున పాత్ర గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతూ సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో నాకు రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారు ఇద్దరు కూడా రెండు కళ్ళు లాంటి వారని తెలియజేశారు.
ఇప్పటికే తాను కమల్ హాసన్, రజనీకాంత్ గారితో సినిమాలు చేశానని అయితే తెలుగులో కూడా నేను తప్పకుండా సినిమాలు చేస్తానని తెలుగు హీరోలతో సినిమాలు చేయాలని కోరిక తనకు కూడా ఉందని లోకేష్ ఈ సందర్భంగా తెలియజేశారు అయితే ప్రస్తుతం తమిళంలో తాను కమిట్ అయిన సినిమాలు అన్ని పూర్తి అయిన తర్వాతనే తెలుగు సినిమాలు చేస్తాను అంటూ ఈయన క్లారిటీ ఇచ్చారు.. ఇక ఈయన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది అయితే ఇవన్నీ పూర్తి అయిన తర్వాతనే తెలుగు సినిమాలు చేస్తానని తెలిపారు.
