Pawan Kalyan: టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆయనకి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిగతా హీరోలకు అభిమానులు ఉన్నప్పటికీ ఒక పవర్ స్టార్ కి మాత్రం డై హార్డ్ ఫాన్స్ ఉన్నారని చెప్పాలి. పవన్ సినిమాలు థియేటర్ల వద్ద విడుదల అవుతున్నాయి అంటే చాలు ఒక పండగ వాతావరణం తలపిస్తూ ఉంటుంది. అరుపులు, కేకలు, టపాసులు పేలుస్తూ, డీజే స్టెప్పులు వేస్తూ, పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు.
ఇలా ఆ ప్రాంగణమంతా కూడా సందడి వాతావరణం నిండిపోతూ ఉంటుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే మొన్నటి వరకు రాజకీయాలు అంటూ బిజీ గా గడిపిన పవర్ స్టార్ ప్రస్తుతం రాజకీయాలకు చిన్న బ్రేక్ ఇచ్చారు. అలా అని రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టేయకుండా ఒకవైపు ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలను నిర్వహిస్తూనే మరొకవైపు హీరోగా కమిట్ అయిన సినిమాలను తొందర తొందరగా పూర్తి చేస్తున్నారు.
అందులో భాగంగానే ఇటీవల హరిహర వీర మల్లు సినిమా షూటింగ్ని పూర్తి చేయగా తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్గా స్పందన లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందు వైజాగ్ లో జరిగిన ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా వేదికపై పవన్ కళ్యాణ్ ఒకసారిగా హరిహర వీర మల్లు సినిమా పాటలు పాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. పవన్ పాటలు పాడడంతో అభిమానులు ఒక్కసారిగా అరుపులు కేకలతో ఫుల్ ఖుషి అయిపోయారు. ఆ అరుపులు కేకలకు స్టేజి మొత్తం దద్దరిల్లిపోయింది.
Pawan Kalyan: స్టేజ్ పై పాటలు పాడి ఆశ్చర్యపరిచిన పవన్ కళ్యాణ్.. దద్దరిల్లిపోయిన స్టేజ్!
