‎War 2: ఆయన ఆశీస్సులు ఉన్నంతకాలం నన్ను ఎవరూ ఆపలేరు.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

War 2: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్, హృతిక్ ప్రధాన పాత్రలలో నటించిన లేటేస్ట్ మూవీ వార్ 2. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మూవీ మేకర్స్. ఈ ఈవెంట్ లో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఈ రోజు ఇంత అద్భుతంగా మీ అందరితో ఈ పండగ జరుపుకోవడానికి నన్ను బాగా బలవంతపెట్టిన నాగవంశీకి చాలా థాంక్స్.

‎13 ఏళ్ల క్రితం బాద్షా ఈవెంట్ సమయంలో వరంగల్ లో తొక్కిసలాటలో ఒక అభిమాని చనిపోవడం నన్ను ఎంతో బాధ పెట్టింది. అందుకే నేను పబ్లిక్ ఈవెంట్స్ అంటే భయపడతాను. వార్ 2 నేను చేయడానికి కారణం ఆదిత్య చోప్రా. ఈ సినిమా నువ్వు చేయాలి. మీ అభిమానులు గర్వపడేలా ఈ సినిమాను తీస్తాను అని చెప్పి నాకు ఈ సినిమా చేసేందుకు భరోసా ఇచ్చిన ఆదిత్య చోప్రా గారికి థాంక్స్. నన్ను యశ్ రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్ లోకి తీసుకున్నందుకు థాంక్స్. నన్ను ముంబైలో జాగ్రత్తగా, కుటుంబంలా చూసుకున్నందుకు YRF టీమ్ కి మొత్తానికి కూడా థాంక్స్. అయాన్ తెరకెక్కించిన బ్రహ్మాస్త్ర సినిమా వేడుకకు నేను అతిథిగా రావాల్సింది.

‎కానీ కొన్ని కారణాలతో నేను రాలేకపోయాను. అప్పుడు అయాన్ కూడా రాలేదు. కానీ ఇప్పుడు నా దర్శకుడిగా వచ్చాడు. ఇద్దరు స్టార్స్‌ ను పెట్టుకుని మూవీని ఈ స్థాయిలో తీయడం నిజంగా అద్భుతం. మూవీని అద్భుతంగా తీయడానికి ఆయన ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. అలాగే 25 ఏళ్ల కిందట నిన్ను చూడాలని అనే చిత్రంతో నా ప్రయాణం మొదలైంది. రామోజీరావు నన్ను ఆయన సంస్థ నుంచి పరిచయం చేశారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చల్లని చూపు నాపైన ఎప్పుడూ ఉంటుంది. అందరికంటే ముఖ్యంగా ఎన్ని యుగాలు దాటినా మరవలేని పేరు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు. ఆయన ఆశీస్సులు నా మీద ఉన్నంతకాలం నన్నెవ్వరూ ఆపలేరు అని తెలిపారు ఎన్టీఆర్.