ఎన్టీఆర్ ను కుంటి గుర్రంతో పోల్చిన రాజమౌళి.. రాజమౌళి పై గుర్రుగా ఉన్న తారక్ ఫ్యాన్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నిన్ను చూడాలని సినిమాతో తన కెరియర్ ప్రారంభించినప్పటికీ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఈ సినిమా ఎన్టీఆర్ కి రెండవ సినిమా కావడం దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మొదటి సినిమా కావడం విశేషం.స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాని శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత అశ్విని దత్ నిర్మించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన ఈ సినిమాని ముందుగా ప్రభాస్ తో చేయాలని భావించినట్లు వెల్లడించారు.

ఇక ఈ సినిమాని చేయాలనుకున్న నేపథ్యంలో హరికృష్ణ గారు ఫోన్ చేసి ఈ సినిమా అవకాశం ఎన్టీఆర్ కు కల్పించాలని చెప్పడం వల్లే ఈ సినిమాలో హీరోగా ఎన్టీఆర్ కి అవకాశం వచ్చిందని ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరో అని ప్రకటించడంతో రాజమౌళి మొదటి సినిమాకే ఇలాంటి హీరో దొరకాడేంటి, ఇది నా కర్మ అని అనుకున్నారట. కుంటి గుర్రంతో రేసులో గెలిస్తే ఎలా ఉంటుంది అనే మెంటాలిటీ తో ఈ సినిమా చేసినట్లు రాజమౌళి గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే హీరో అందంగా లేకపోయినా మనం సినిమాని అందంగా చేస్తే మనకే మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి అనే ఉద్దేశంతో ఈయన ఈ సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు.ఈ విధంగా ఎన్టీఆర్ ని రాజమౌళి కుంటి గుర్రం అని పోల్చడంతో ఎన్టీఆర్ అభిమానులు రాజమౌళి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఒకప్పటి ఆ కుంటి గుర్రమే నేడు పాన్ ఇండియా హీరో అయ్యారు. అంటూ పెద్ద ఎత్తున రాజమౌళి పై ఎన్టీఆర్ అభిమానులు ట్రోలింగ్ చేస్తున్నారు. మొత్తానికి గతంలో ఎన్టీఆర్ పట్ల రాజమౌళి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.