Srinivasa Mangapuram: జయకృష్ణ ఘట్టమనేని, #AB4 టైటిల్ ‘శ్రీనివాస మంగాపురం’- టైమ్‌లెస్ కల్ట్‌ ప్రీ-లుక్ పోస్టర్ రిలీజ్

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు, జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా గ్రాండ్‌గా లాంచ్ అవుతున్నారు. RX 100, మంగళవారం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల విజనరీ ఫిల్మ్ మేకర్ అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ వెండితెర అరంగేట్రం చేయబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను వైజయంతి మూవీస్‌ అశ్విని దత్ సమర్పిస్తున్నారు. చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు.

టైమ్‌లెస్ కల్ట్‌ ప్రేమకథగా ఉండబోతే ఈ సినిమా టైటిల్‌ను అద్భుతమైన ప్రీ-లుక్ పోస్టర్ ద్వారా మేకర్స్ ఆవిష్కరించారు. ఈ చిత్రానికి ‘శ్రీనివాస మంగాపురం’ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. పోస్టర్ లో హీరో చేతులు, అతని లవర్ చేతులు ఒక రస్టిక్ గన్ పట్టుకుని పట్టుకుని ఉండటం ఆసక్తికరంగా వుంది. ఈ పోస్టర్ సినిమాలో రోమాన్స్, హైస్టేక్ యాక్షన్ ని సూచిస్తుంది. బ్యాక్ డ్రాప్ లో పవిత్రమైన తిరుమల ఆలయం ,ప్రశాంతమైన శేషాచలం కొండలు సినిమా డెప్త్ ని ప్రజెంట్ చేస్తున్నాయి. రెండు జీవితాలు – ఒక ప్రయాణం. రెండు చేతులు – ఒక ప్రామిస్. రెండు మనసులు – ఒక విధి. ప్రీ-లుక్ ఇంపాక్ట్ ఫుల్ గా వుంది.

జయకృష్ణ తన పాత్ర కోసం ఇంటెన్స్ గా సిద్ధమవుతున్నారు, ప్రస్తుతం ఈ చిత్రం కోసం షూటింగ్ చేస్తున్నారు. బాలీవుడ్ నటి రాషా తడాని అతనికి జోడిగా కనిపించనున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతుంది.

సూపర్ స్టార్ కృష్ణతో కల్ట్ బ్లాక్ బస్టర్ అగ్ని పర్వతం చిత్రాన్ని నిర్మించి, తరువాత రాజకుమారుడుతో ప్రిన్స్ మహేష్ బాబును తెలుగు సినిమాకు పరిచయం చేసిన అశ్విని దత్, ఇప్పుడు మూడవ తరం స్టార్ జయ కృష్ణ ఘట్టమనేనిని పరిచయం చేస్తూ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ జీ.వి. ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. వరుస బ్లాక్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన ఆయన సంగీతం ఈ సినిమాకు మెయిన్ హైలెట్ కానుంది. సహాయ నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

ఇప్పటికే విడుదలైన టైటిల్, ప్రీ-లుక్ పోస్టర్ సినిమాపై మంచి హైప్‌ని క్రియేట్ చేశాయి. ఫస్ట్ లుక్‌తో పాటు మరిన్ని అప్‌డేట్స్ త్వరలోనే రానున్నాయని మేకర్స్ తెలియజేశారు.

తారాగణం: జయ కృష్ణ ఘట్టమనేని, రాషా తడాని

సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: అజయ్ భూపతి
సమర్పణ: అశ్విని దత్
నిర్మాత: పి. కిరణ్
బ్యానర్: చందమామ కథలు
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
పీఆర్వో: వంశీ-శేఖర్

Journalist Bharadwaj Reacts On Ayyappa Swamis Protest For Kanchanbagh Police station SI Issue || TR