బాక్సాఫీస్ : వరల్డ్ వైడ్ “పఠాన్” కి మైండ్ బ్లాకింగ్ ఓపెనింగ్స్.!

బాలీవుడ్ సినిమా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ బిగ్గెస్ట్ ఓపెనింగ్ మరియు వారికి ఎంతో కీలకంగా కావాల్సిన భారీ హిట్ ఫైనల్ గా షారుఖ్ ఖాన్ రూపంలో వచ్చింది. తన లేటెస్ట్ చిత్రం “పఠాన్” తో మరోసారి తనని బాలీవుడ్ కింగ్ అని ఎందుకు అంటారో షారుఖ్ ఖాన్ ప్రూవ్ చేసాడు.

దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో దాదాపు 8 వేల స్క్రీన్స్ లో వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం అనుకున్నట్టుగానే రికార్డు మొత్తం ఓపెనింగ్స్ ఈ చిత్రం రాబట్టినట్టుగా బాలీవుడ్ వర్గాల వారు చెప్తున్నారు. మరి వరల్డ్ వైడ్ పఠాన్ ఎంత రాబట్టింది అంటే ఈ చిత్రం ఏకంగా 100 కోట్లకి పైగా గ్రాస్ ని కొల్లగొట్టింది అట.

ఇది హిందీ మార్కెట్ నుంచి మొదటి సినిమా కాగా ఇండియన్ సినిమా నుంచి బాహుబలి సిరీస్ సాహో, 2.0 RRR మరియు కేజీఎఫ్ చిత్రాల తర్వాత ఒకటిగా ఇది నిలిచి రికార్డు సృష్టించింది. దీనితో బాలీవుడ్ వర్గాలు షారుఖ్ ఖాన్ దెబ్బ చూసి మైండ్ బ్లాక్ రియాక్షన్ వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ చిత్రం ఇండియా లో 67 కోట్లకి పైగా వసూలు చేయగా ఓవర్సీస్ మార్కెట్ నుంచి 35 కోట్లు ఫస్ట్ డే కొల్లగొట్టింది. దీనితో అయితే పఠాన్ కి గ్రాండ్ వెల్కమ్ దక్కింది. ఇంకా ఈ భారీ ఏక్షన్ డ్రామా లో దీపికా పదుకొనె నటించగా సల్మాన్ ఖాన్ కూడా ఓ చిన్న పాత్రలో కనిపించారు. అలాగే జాన్ అబ్రహం విలన్ గా నటించాడు. ప్రస్తుతం ఈ చిత్రం సూపర్ టాక్ తో భారీ షోస్ తో దూసుకెళ్తుంది.