బాక్సాఫీస్ బ్లాస్ట్ : మిరాకిల్స్ సెట్ చేసిన “పఠాన్” 3డేస్ వసూళ్లు.!

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ ఏక్షన్ థ్రిల్లర్ చిత్రం “పఠాన్”. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రంలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించగా జాన్ అబ్రహం విలన్ గా నటించాడు. మరి ఈ సినిమా ఎన్నో అంచనాలు మధ్య రావడం ఒకెత్తు అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెట్ చేస్తున్న ఫిగర్స్ ఇంకో ఎత్తు అని చెప్పాలి.

ఇక మొదటి రోజే 100 కోట్లకి పైగా భారీ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం రెండో రోజు కూడా ఊహించని విధంగా మళ్ళీ భారీ మార్జిన్ తో ఇంకో 100 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇక మూడో రోజుకి వచ్చేసరికి కూడా రికార్డు మొత్తం వసూళ్లు అందుకున్నట్టుగా ట్రేడ్ వర్గాల వారు చెప్తున్నారు.

అయితే పఠాన్ మొత్తం మూడు రోజుల్లో ఏకంగా 313 కోట్ల భారీ గ్రాస్ ని అందుకుందట. దీనితో బాలీవుడ్ నుంచి పఠాన్ ఫాస్టెస్ట్ రికార్డు గ్రాసర్ గా నిలవనుండగా ఇక నాలుగో రోజు నాటికి అయితే ఒక్క హిందీ వెర్షన్ లోనే ఈ చిత్రం సుమారు 250 కోట్ల మార్క్ ని కొట్టేస్తుందని ట్రేడ్ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా స్పీడ్ చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్ల మార్క్ కి చేరుకున్నా ఆశ్చర్యం లేదని చెప్పొచ్చు. ఆ రేంజ్ వసూళ్లు వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం మిరాకిల్స్ గా సెట్ చేస్తుంది. ఈ వీకెండ్ మళ్ళీ భారీ మొత్తంలో వసూళ్లు డెఫినెట్ గా పెరుగుతాయి మరి ఈ రెండు రోజుల్లో ఎలా లేదన్నా 500 కోట్ల మార్క్ కి సినిమా వచ్చేస్తుందో లేదో అనేది చూడాలి.