చిరంజీవితో పోల్చి పవన్ కల్యాణ్ ని అవమానించిన నాగబాబు!

NagaBabu Wants To See Pawan Kalyan In George Reddy Character

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీ మెగా కుటుంబం నుండి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి నంబర్ వన్ హీరోగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇక మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అన్న బాటలోనే ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుని పవర్ స్టార్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు మాత్రం హీరోగా ప్రయత్నాలు చేసినప్పటికీ సక్సెస్ సాధించలేకపోవటంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయాడు.

ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీలో ఉన్న ఫాలోయింగ్ ఎటువంటిదో అందరికీ తెలిసిందే. పవర్ స్టార్ సినిమా హిట్ కాకపోయినా కూడా అభిమానులు ఆయనని దేవుడిగా భావిస్తారు. ఇక ఇప్పుడు రాజకీయాలలో లో అభిమానులు పవన్ కళ్యాణ్ కి అండగా నిలుస్తున్నారు. ఇలా ప్రజలలో స్టార్ హీరోగా ఎనలేని అభిమానాన్ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ని అవమానపరిచేలా నాగబాబు మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నారు. గతంలో సుమ షో లో పాల్గొన్న నాగబాబు ని పవన్ కళ్యాణ్ గురించి అడగ్గా నాగబాబు షాకింగ్ కామెంట్స్ చేశాడు.

గతంలో షోలో పాల్గొన్న నాగబాబుని ” పవన్‌ కల్యాణ్‌ కు అంత మంది ఫ్యాన్స్‌ ఉండటంపై మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించింది. దీంతో నాగబాబు స్పందిస్తూ..” చిరంజీవితో పోలిస్తే పవన్ కళ్యాణ్‌ కు యాక్టింగ్ డ్యాన్స్‌ లు పెద్దగా రావు. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో ఇండస్ట్రీ హిట్లు కూడా లేవు. కానీ పవన్ కు అంతమంది ఫ్యాన్స్‌ ఉండటానికి అతని వ్యక్తిత్వమే ముఖ్య కారణం. అన్నయ్య సినిమాలు చూసి ఆయనకి అభిమానులుగా మారారు. కానీ పవన్ కు దాదాపు పదేండ్ల పాటు హిట్లు లేకపోయినా ప్రజల గుండెల్లో అభిమానం మాత్రం అలాగే ఉండటానికి కారణం పవన్ బాబు వ్యక్తిత్వం. పవన్ కళ్యాణ్ చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అది చూసే ప్రజలు అతనికి అభిమానులుగా మారారు అంటూ గురించి ఒకవైపు గొప్పగా చెబుతూనే మరొకవైపు పవన్ కళ్యాణ్ కి యాక్టింగ్, డాన్స్ రావని అవమానపరిచేలా మాట్లాడాడు. గతంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.